NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

బాబోరు… ఇది మీరు నేర్పిన విద్యే!!

 

 

చంద్రబాబు వ్యవస్థలపై కేసులు పెట్టండి అనడం ఏంటి?? వారిపై ఎదురు కేసులు పెడితే వచ్చే లాభం ఏంటి?? జూమ్ మీటింగ్ కాల్ బయటకు ఎలా వచ్చింది?? పోలీసులపై ఎదురు కేసులు పెడితే వాళ్ల కాళ్ల బేరానికి వస్తారని చెప్పడం సరైన పద్ధతేన?? విజయసాయి రెడ్డి వెంటనే దీనిపై వీడియో పెట్టి మరి ట్విట్ చేయడం అవసరమా?? ఇదే నా 40 ఏళ్ల అనుభవం?? అంతర్గత మీటింగ్ లోని విషయాలు బయటికి ఎలా వస్తున్నాయి?? ఇలా ఎన్నో రకాల సోషల్ మీడియా ట్రోలింగ్ నిన్నటి నుంచి జోరుగా జరుగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ పార్టీ నాయకులతో జూమ్ మీటింగ్లో మాట్లాడుతూ కేసులకు భయపడి వద్దని, పోలీసుల పైన ఎదురు కేసులు పెడితే కాళ్లబేరానికి వస్తారని చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. దీనిపై రకరకాల ట్రోల్స్, రకరకాల వ్యాఖ్యానాలు ఉపందుకున్నాయి.

చంద్రబాబు 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటారే తప్ప… సాంకేతికత విషయంలో వెనుకబడ్డారు. ఐటీ మొత్తం తానే తీసుకు వచ్చాను అని చెప్పుకుంటారు తప్ప ప్రస్తుత కాలంలో సాంకేతికతలో గోప్యం లోపించిందని విషయం చంద్రబాబు మర్చిపోయినట్లున్నారు.. ఆయన జూ మీటింగ్లో అంతర్గతంగా పార్టీ నాయకులతో మాట్లాడిన మాటలు ఇప్పుడు స్క్రీన్ రికార్డు చేసి మరి బయటకు వచ్చాయి… అంటే ఆ పార్టీలోని కొందరు వేగులు ఆ విషయాలను బయటపెట్టారు అని అర్థమవుతుంది. అందులోనూ వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించి మరి వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసి రెండు కామెంట్లు పెట్టడం, అది వైరల్ గా మారడం క్షణాల్లో జరిగిపోయాయి. పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి ఇలా అనైతికంగా మాట్లాడ్డం సరికాదంటూ వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు చంద్రబాబు పై విరుచుకుపడుతున్నారు.

కేసుకు కేసు

జగన్ ప్రభుత్వంలో పోలీసులు పూర్తిగా టిడిపి కార్యకర్తలను నాయకులను ఇబ్బంది పెడుతున్నారని గుంటూరు జిల్లాకు చెందిన ఓ నాయకుడు ప్రస్తావించగా చంద్రబాబు స్పందించారు. లీగల్ గాని దీన్ని ఎదుర్కోవాలని పోలీసులు ఎదురు కేసులు పెడితే వాళ్లు కాళ్లబేరానికి వస్తారని వ్యాఖ్యానించారు.
** ఎలాంటి ఆరోపణ ఎలాంటి నేరం లేకుండా పోలీసులపై కేసులు పెట్టడం సాధ్యం కాదు. ఒకవేళ కోర్టులో ప్రైవేటు కేసులు వేసిన దానికి తగిన నేర నిరూపణ అవసరం. దీని చంద్రబాబు మరిచినట్టు ఉన్నారు.
** ప్రైవేట్ కేసుల్లో కోర్టులు కేసులు నమోదు చేయమని చెప్పినా అది తిరిగి మళ్ళి పోలీస్ స్టేషన్ కి వస్తుంది. ఆ సమయంలో పోలీసులు పై పోలీసులు కేసు నమోదు చేస్తారా?? లేక వారు లీగల్గా ఎదుర్కొంటే టిడిపికి చిక్కులే.
** చంద్రబాబు మాటల వల్ల పోలీసు శాఖ లోనూ అధికారులకు కోపం వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రతిపక్షంగా ప్రస్తుతం టిడిపి నాయకులపై కొన్ని కేసులు నమోదవుతున్నాయి మాట వాస్తవమే గానీ… వేధింపుల వరకు వెళ్ళింది అనేది అవాస్తవం.
** 2014 నుంచి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏబీ వెంకటేశ్వరరావు మొత్తం తానే అయి నడిపించారు. ఇంటెలిజెన్స్ అధిపతిగా ఉన్న ఆయన ప్రభుత్వ వ్యవస్థలను శాసించారు. బదిలీలు దగ్గరనుంచి వైఎస్సార్సీపీ నాయకుల కదలికలు తెలుసుకొని మరి వారిపై కేసులు బనాయించారు. ఇది ఎవరు కాదన్నా అవునన్నా నిజం. చంద్రబాబు ప్రభుత్వం పతనానికి ఏబీ వెంకటేశ్వరరావు పరోక్షంగా కారణం అయ్యారు.
** ఇప్పుడు టిడిపి కార్యకర్తలు నాయకులు పై వై ఎస్ ఆర్ సి పి నాయకులు కాస్త కోపంగా ఉన్న మాట వాస్తవమే. కొన్ని చోట్ల దాడులు జరుగుతున్నాయి. దీనికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారు అనడంలో సందేహం లేదు. అధికారంలో ఏపార్టీ ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా వ్యవస్థలు పని చేయడం ఆంధ్రప్రదేశ్లో అలవాటైపోయింది. దీనికి ఆద్యుడు చంద్రబాబే.

ఏది ఏమైనా ఇప్పుడు వై ఎస్ ఆర్ సి పి నాయకులు కార్యకర్తలు చెప్పేదేమంటే…. “” నీవు నేర్పిన విద్యే నీరజక్ష “” అని…..

author avatar
Comrade CHE

Related posts

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju

Raadhika Sarathkumar: క‌ళ్లు చెదిరే రేంజ్ లో న‌టి రాధిక ఆస్తులు.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

kavya N