చంద్రయాన్-2కు హాల్ట్

ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ -2కు హాల్ట్ పడింది. ప్రజలకు వివరించడానికి వీలులేని కారణాలతో చంద్రయాన్ -2 వాయిదా వేసినట్లు ఇస్రో చైర్మన్ శివన్ తెలపారు.

వాస్తవానికి చంద్రయాన్-2 ప్రయోగం ఈ రోజు జరగాల్సి ఉండగా అది వాయిదా పడింది. తిరిగి ఎప్పుడు నిర్వహించేదీ తరువాత ప్రకటిస్తామని ఆయన తెలిపారు. కాగా చంద్రయాన్-2 వాయిదా పడటం ఆదే తొలిసారి కాదు. గతంలో కూడా ఒక సారి అనివార్య కారణాలు ఉటంకిస్తూ వాయిదా పడిన సంగతి విదితమే.