Pubba: పుబ్బ నాలుగు పాదాలు
పుబ్బ మొదటి పాదం రవి కి చెందినది. వీరువీరి కళ్ళు చంచలమైనవిగా ఉంటాయి. బలహీనంగా కనిపిస్తుంటారు. కొనుగోలుచేయడం , అమ్మడం వంటి వ్యవహారాలు ఉన్న వ్యాపారాలలో నైపుణ్యాత ఉంటుంది.
పుబ్బ రెండొవ పాదం బుధుడికి చెందినది. వీరు మంచి కీర్తి ప్రతిష్ఠల తో ఉంటారు. చూడచక్కని రూపం కలిగి ఉండరు. ఇతరులకు కష్టం కలిగిస్తూ ఉంటారు.పుబ్బ మూడోవ పాదం శుక్రుడికి చెందినది గా చెప్పబడింది. వీరికి సంతానం గా కొడుకులే ఉంటారు. శిల్పశాస్త్రంలో నిష్ణాతులు గా ఉంటారు. గణిత శాస్త్రంలో కూడా మంచి స్కిల్స్ కలిగి ఉంటారు.
పుబ్బ నాలుగోవ పాదం కుజుడి కి చెందినది. వీరు జీవితం లో సుఖం పొందలేరు. ఎప్పుడు కష్టాలను ఎదురుకుంటూ ఉంటారు. వీరు అధిక సంతానం తో ఉంటారు. దరిద్రాన్ని పొందివుంటారు.
Pubba: ఉత్తర నక్షత్ర నాలుగు పాదాలు
ఉత్తర నక్షత్రం ప్రధమ పాదం గురువు కి చెందినది. వీరు వాత రోగం తో ఉంటారు. వీరు పరిశుద్ధులుగా , ప్రబంధ ప్రియులుగా , కావ్యాస్వాదనా చతురత కలిగి ఉంటారు.
ఉత్తర రెండొవ పాదం శని కి చెందినది. ఇతరులను పీడించే వారిగాను, చంచలత్వం ఉన్నవారిగా, ఎప్పుడు దరిద్రం తో బాధపడేవారిగా ఉంటారు.
ఉత్తర నక్షత్రం మూడోవ పాదం శనికి సంబందించినది. మేలు చేసిన వారిని మర్చిపోతుంటారు. చెడు వాదనలు చేయగలగడం తో పాటు డాంబికాలు ప్రదర్శిస్తూ , గర్విష్టులుగా ఉండి , అందరిని సూటిపోటీ మాటలతో బాధిస్తుంటారు.
ఉత్తర నాల్గొవ పాదం గురువు కి చెందినది. వినయ విధేయతలు పొందినవారు,విద్యా సంపన్నులు గా ఉంటారు. కొడుకులను సంతానం గా పొందేవారిగా ఉంటారు.