Dhanista satabisha : ధనిష్ఠ నక్షత్ర నాలుగు పాదాలు
ధనిష్ఠ మొదటి పాదం రవి కి చెందినది. వీరు స్ధూలమైన శరీరం ఉన్నవారు, దానగుణం ఉన్నవారు, ఆడవారిపైనా పైన ఇష్టం ఉన్నవారిగా చెప్పవచ్చు. ధనిష్ఠ రెండో పాదం బుధుడి కి చెందినది.వీరి మాట వినయ విధేయత లు కలిగి ఉంటుంది. ఉన్నత చదువులు చదివేవారుగా ఉంటారు. ధనిష్ఠ మూడోపాదం శుక్రుడి కి చెందినది. వీరు గుణవంతులని చెప్పవచ్చు. వీరు దీర్గాయుషు కలిగి ఉంటారు . సత్యాన్ని పలికే వారిగా ఉంటారు.ధనిష్ఠ నాల్గొవ పాదం కుజుడి కి చెందినది. వీరు ఎప్పుడు పాప కర్మలు చేయడం లో మునిగిపోతుంటారు. క్రూర స్వభావం తో ఉంటారు. స్దూలమైన శరీరం తో ఉంటారు.
Dhanista satabisha : శతభిష నక్షత్ర నాలుగు పాదాలు
శతభిష మొదటి పాదం గురువు కి చెందినది. వీరు గోవులను పూజిస్తారు. బ్రాహ్మణులన్నా గౌరవం ఉంటుంది. సత్యం పలికేవారు, బుద్ధి లో స్థిరత్వం కలవారు, అభిమానవంతులుగా , స్నేహములను వీరు కలిగి ఉంటారు.
శతభిష రెండొవ పాదం శని కి చెందినది. ఈ జాతకులు పిరికి వారుగా ఉంటారు. ఏ పని త్వరగా చేయరు. పాపభీతి అనేది బాగా ఉంటుంది.శతభిష మూడో పాదం శనికి చెందినది. వీరు పుత్ర సంతానం తో ఉంటారు. పాండిత్యం ఉన్నవారు. మంధ బుద్ధికలవారు ,పాపపు పనులు చేయువారు. ఉగ్ర మైన పనులు చేయువారుగా చెప్పవచ్చు . శతభిష నాల్గొవ పాదం గురువుకి చెందినది. వీరు స్నేహ బుద్దితో ఉంటారు. పండితులుగా , అభిమానవంతులుగా , యజ్ఞ కార్యాలు చేసేవారిగా ఉంటారు.