Uttarashada sravana nakshatra: ఉత్తరాషాడ నాలుగు పాదాలు
ఉత్తరాషాడ (uttarashada ) మొదటి పాదం గురువు కి చెందినది. వీరు బుద్ధిమంతులు గా శాస్త్రవేత్తలు గా , స్ధిరాస్తులు కలవారిగా , పెద్దలయందు భక్తి తో ఉండువారు, ధర్మపాలన చేసేవారీగా ఉంటారు. ఉత్తరాషాడ రెండొవ పాదం శని కి చెందినది. వేరు అసలు ఏమాత్రం పనికి రాని పనులు చేయటంలో నిపుణులు. ఇతర మతాలపట్ల ప్రేమాభిమానాలు ఎక్కువగా కలిగి ఉంటారు. ఉత్తరాషాడ మూడోవ పాదం శనికి చెందినది. స్ధూలమైన శరీరం కలిగినవారు చాలా అల్ప సంతోషులు, ఎప్పుడు ఎదో ఒక రోగం తో బాధ పడుతుంటారు.ఉత్తరాషాడ నాల్గొవ పాదం గురువు కి చెందినది. శుభములు కలుగువారు , ఎప్పుడు ఏదో ఒక పని చేసేవారు, శాస్త్ర విషయాల మీద శ్రద్ధ కలవారు, వ్యాపార లక్షణాలు ఉన్నవారు,ఉత్సాహవంతులుగా ఉండేవారిగా చెప్పుకోవచ్చు.
Uttarashada sravana nakshatra: శ్రావణా నక్షత్ర నాలుగు పాదాలు
శ్రావణా నక్షత్ర ( Sravan nakshatra ) మొదటి పాదం కుజుడి కి చెందినది. గొడవాలంటే ఇష్టం , పుత్ర సంతానంపొందలేని వారు, గుల్మరోగం సమస్య తో ఉంటారు. శ్రావణా నక్షత్ర రెండొవ పాదం శుక్రుడి కి చెందినది. పని చేయడం కోసం సేవకులు కలవారు,తంత్ర విద్యలపైనా ఆసక్తి కలిగి ఉన్నవారు, కామత్వం కలిగిన వారుగా ఉంటారు.శ్రావణా నక్షత్ర మూడోవ పాదం బుధుడి కి చెందినది. వీరు గొప్ప ఉదార స్వభావం తో ఉంటారు. చిత్రలేఖనం చేసేవారు , గొడవాలంటే ఇష్టపడేవారిగా ఉంటారు. శ్రవణా నక్షత్ర నాల్గొవ పాదం చంద్రుడి కి చెందినది. వీరు పసువులను పోషించే వారు, యోగులుగా , ధార్మికులు గా ఉంటారు . వీరికి ముక్కు పొడవుగా ఉంటుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?