చరణ్ కూడా క్లారిటీ ఇచ్చాడు .. ఇక ఆచార్య విషయంలో మిగిలింది ఆ ఒక్కటే …!

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం ‘ఆచార్య’.. కాగా ఈ మూవీలో చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. రామ్ చరణ్ కీలకపాత్ర పోషించనున్నారన్న విషయం తెలిసిందే. ఇక చరణ్ పోషించే పాత్ర ఈ సినిమాకే హైలైట్ కానుందని, ఇందుకోసం ఆయన రిస్క్ చేస్తున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇక రామ్ చరణ్, చిరంజీవి వారసుడిగా సినీ ఎంట్రీ ఇచ్చిన.. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుని, సక్సెస్‌ఫుల్ కెరీర్ కొనసాగిస్తూ ప్రతి సినిమాకు పరిణితి చెందుతున్నారు. కాగా ఇప్పుడు ఆచార్య సినిమాలో తండ్రి చిరంజీవి కోసం రిస్క్ చేయబోతున్నారనే విషయం మెగా అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

Chiranjeevi's Acharya Story Stolen? | Gulte - Latest Andhra Pradesh,  Telangana Political and Movie News, Movie Reviews, Analysis, Photos

ఇకపోతే “ఆచార్య” సినిమాలో చరణ్ పాత్ర కన్ఫర్మ్ కావడంతో ఈ మూవీ పై భారీ స్థాయి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా షూటింగ్‌లో చరణ్ ఎప్పుడు పాల్గొంటాడో అన్న దానిపై ఇంతవరకు క్లారిటీ లేదు.. అయితే తాజాగా ఫిలిం నగర్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం చరణ్ వచ్చే జనవరి మూడో వారంలో ఆచార్య సెట్స్ లోకి అడుగు పెట్టనున్నాడట. ఇదివరకే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శక ధీరుడు రాజమౌళి తీస్తున్న బిగ్ మల్టీ స్టారర్ అండ్ పీరియాడిక్ డ్రామా ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా కనిపిస్తుండడంతో ఈ మల్టీ స్టారింగ్ చిత్రంపై ఎనలేని హైప్ నెలకొంది. ఇదిలా ఉంటే చరణ్ ఈ చిత్రంతో పాటుగా మరో బిగ్ మల్టీ స్టారర్ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే.

కాగా ఆచార్య మూవీలో చరణ్ పై ఉన్న కొన్ని కీలక షాట్స్ ను అలాగే చిరు మరియు చరణ్ ల నడుమ షాట్స్ ను వేగంగా తీస్తున్నారని టాక్. మొత్తానికి ఈ క్రేజీ కాంబోపై మాత్రం చాలానే అంచనాలు ఉన్నాయి. అలాగే ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం కావడం మరో బిగ్ ఎస్సెట్ గా నిలిచింది. ఇక మేకర్స్ స్పీడ్ చూస్తుంటే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి రేస్ లో విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది.. కాని పక్కాగా ఎప్పుడన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఆ సమయానికి ఆర్ ఆర్ ఆర్ .. రాధే శ్యాం లాంటి సినిమాలు బరిలో ఉంటే ఈ చిత్ర మేకర్స్ ప్లాన్ మారుస్తారా అనే సందేహాం కూడా కలుగుతుంది.. ఇదొక్కటి కూడా క్లారీటి ఇస్తే చిరు అభిమానుల్లో ఫుల్ జోష్ వస్తుంది.