RRR సినిమా మీద రాజమౌళి లేటెస్ట్ అప్డేట్ అద్దిరిపోయింది .. చరణ్ ఫాన్స్ కి పండగే !

Share

దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీ స్టారర్ రౌద్రం రణం రుథిరం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్నారు. డీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై డివీవీ దానయ్య దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. భారీ పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ‘అల్లూరి సీతారామరాజు’ గా, ఎన్టీఆర్ ‘కొమరం భీమ్’ గా శంక్తి వంతమైన పోరాట యోధుల పాత్రల్లో కనిపించనున్నారు.

SS Rajamouli's RRR to be the first film to resume shooting post lockdown?  Find out | PINKVILLA

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా బ్రిటన్ మోడల్ ఒలివియా మోరిస్ నటిస్తుండగా.. చరణ్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ సీత పాత్రలో నటిస్తుంది. అయితే అలియా ని ‘ఆర్.ఆర్.ఆర్’ నుంచి తప్పించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

బాలీవుడ్ లో అలియా భట్ ‘గంగూబాయ్’ ‘బ్రహ్మస్త్ర’ సినిమాల్లో నటిస్తోంది. కరోనా కారణంగా షూటింగ్స్ వాయిదా పడటంతో ఆలియా డేట్స్ క్లాష్ వచ్చే అవకాశం ఉందని.. అందుకే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని ఈ మద్య వార్తలు వచ్చాయి. అయితే ‘ఆర్.ఆర్.ఆర్’ మోషన్ పోస్టర్ తో పాటు చరణ్ పాత్రని పరిచయం చేసిన వీడియో ద్వారా అలియా నే ఈ సినిమాలో హీరోయిన్ అని మేకర్స్ అధికారకమంగా ప్రకటించారు. అయితే బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో అప్పటికి ఇప్పటికి పరిస్థితులు చాలా మారాయి.

సుశాంత్ మరణానికి నెపోటిజం యాక్టర్స్ కారణమని.. ముఖ్యంగా అలియా తండ్రి మహేష్ భట్ పాత్ర ఈ విషయంలో ఎక్కువగా ఉందని తీవ్రంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఇటీవల రిలీజైన అలియా భట్ ‘సడక్ 2’ ట్రైలర్ ని ప్రపంచంలోనే అత్యధికమంది డిస్ లైక్స్ కొట్టిన లిస్ట్ లో చేరింది. అయితే ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అలియా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ .. ముఖ్యంగా ఆర్ ఆర్ ఆర్ ఫై పడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాకి అలియా వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని భావించిన మేకర్స్ ఆలియా ప్లేస్ లో మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ని తీసుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. కాగా బాలీవుడ్ లో కూడా పాపులారిటీ తెచ్చుకున్న సౌత్ హీరోయిన్ తీసుకోవాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఎక్కువగా కియారా అద్వాని పేరు వినిపిస్తుంది. ఇక ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ జరుపుకున్న ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ స్టార్ట్ అయితే మరో ఆరు నెలల సమయం పడుతుందని జక్కన్న క్లారిటీ ఇచ్చేసాడు. దీనిని బట్టి చూస్తే వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసే అవకాశాలున్నాయి.


Share

Related posts

BREAKING: ప్రెస్ మీట్ పెట్టబోతున్న రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి భారీ ప్రకటన రాబోతోందా..?

amrutha

పంద్రాగస్టు వేడుకలకు సిద్ధమవుతున్న విజయవాడ ఐజీఎంస్‌ స్టేడియం

Vihari

నా బొచ్చు సంగతి నీకెందుకు?

sekhar