న్యూస్

RC15: డైరెక్టర్ శంకర్ పై అసహనంగా ఉన్న చరణ్..?

Share

RC15: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ “RRR” సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకోవడం తెలిసిందే. ఈ సినిమా విజయం సాధించిన వెంటనే అదే రేంజ్ లో పాన్ ఇండియా లెవెల్ లో డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చరణ్ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. “RC15” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం చరణ్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీ. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొన్నటిదాకా శరవేగంగా సాగింది. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో సినీ కార్మికులు ఒక్కసారిగా షూటింగ్ లకు బంద్ ప్రకటించటంతో ఆగస్టు నెలలో షూటింగ్ లో ఆగిపోవడం తెలిసిందే.

Charan is impatient with director Shankar
RC 15

ఈ పరిణామంతో డైరెక్టర్ శంకర్.. కమల్ హాసన్ తో చేస్తున్న “ఇండియన్ 2” షూటింగ్ మొదలుపెట్టడం జరిగింది. ఈ సినిమా షూటింగ్ ఆగిపోయి దాదాపు రెండు సంవత్సరాలు అయ్యింది. అప్పట్లో “ఇండియన్ 2” నిర్మాతలు లైకా ప్రొడక్షన్స్ కి చెందిన వాళ్లకి శంకర్ మధ్య గొడవలు తలెత్తడంతో 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఆ తర్వాత మళ్లీ సెట్స్ పైకి వెళ్ళలేదు.

Charan is impatient with director Shankar
RC 15

కానీ ఇటీవల కమల్ నటించిన “విక్రమ్” బ్లాక్ బస్టర్ కావడంతో.. కమల్ చొరవ తీసుకొని నిర్మాతలకు డైరెక్టర్ శంకర్ కి మధ్య రాజీ కుదిర్చి..”ఇండియన్ 2″ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యేలా చేశారు. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో షూటింగ్ లు స్టార్ అయినా … శంకర్ కమల్  సినిమా పైన ఫోకస్ పెట్టడంతో ఈ మధ్యలో ఇప్పుడు కొన్ని వారాలు పాటు గ్యాప్ రావడంతో చరణ్.. డైరెక్టర్ శంకర్ వ్యవహారంపై అసహనంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మంచి స్పీడ్ మీద ఉన్న సినిమా షూటింగ్ పక్కన పెట్టి..ఇప్పుడు మరొక సినిమాపై శంకర్ ఫోకస్ పెట్టడం పట్ల.. చరణ్ డిసప్పాయింట్ గా ఉన్నట్లు ఫిలింనగర్ టాక్. ఈ క్రమంలో మళ్లీ శంకర్ “RC 15” సెట్స్ లోకి ఎప్పుడొస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది.


Share

Related posts

ఈ జ్యూస్ 5 రోజులు తాగితే బరువు తగ్గుతారు..!

bharani jella

కల్కత్తా కల్పనను శభాష్ అనాల్సిందే ఎవరైనా..

bharani jella

హమ్మయ్య పవన్ కళ్యాణ్ ఇంట్లో నుంచి బయటికొచ్చాడు..బయటికి రావడమే ఎక్కడికెళ్ళాడో తెలుసా ..?

GRK