Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుండి సినిమా రంగంలో రీఎంట్రీ ఇచ్చిన తర్వాత.. ఆయనకు సంబంధించిన సినిమాలు చాలా వరకు చరణ్ దగ్గర ఉండి చూసుకుంటున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఇప్పటి వరకు రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి నటించిన ప్రతి సినిమా సొంత బ్యానర్లో చరణ్ నిర్వహిస్తూ వస్తున్నారు. చాలా వరకు చిరంజీవి సినిమాలకు సంబంధించిన పనులు చరణ్ దగ్గరుండి చూసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఇదే తరుణంలో చరణ్ … త్వరలో చిరంజీవి నటించబోయే “గాడ్ ఫాదర్” సినిమాకి సంబంధించిన పనులు కూడా చూసుకుంటున్నట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో వినబడుతోంది.
మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళంలో సూపర్ సినిమా తెలుగులో గాడ్ ఫాదర్ టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో మోహన్ లాల్ పాత్రను చిరంజీవి కనిపిస్తూ ఉండగా పృథ్వీరాజ్ పాత్రలో సల్మాన్ ఖాన్ నీ నటింప చేయడానికి చరణ్.. సల్మాన్ ని ఒప్పించినట్లు లేటెస్ట్ టాక్. మెగా కుటుంబంతో సల్మాన్ ఖాన్ కి మంచి రిలేషన్ ఉండటంతో పాటు గతంలో చరణ్ నటించిన తుఫాన్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు టైంలో బాలీవుడ్ లో సల్మాన్ బిగ్ హెల్ప్ చేయడం జరిగింది. అదే సమయంలో చరణ్ బాడీ కి సంబంధించి తన పర్సనల్ ట్రైనర్ ని కూడా పంపించడం జరిగింది.
ఇప్పుడు చరణ్ ఆ చనువుతో సల్మాన్ ఖాన్ ని “గాడ్ ఫాదర్” సినిమాలో చిరంజీవి పక్కన క్యారెక్టర్ చేయించడానికి ఒప్పించినట్లు లేటెస్ట్ టాక్. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించాలని బాలీవుడ్ మార్కెట్ నీ దృష్టిలో పెట్టుకుని చిరంజీవి సల్మాన్ అయితే తన పక్కన బాగుంటుందని డైరెక్టర్ మోహన్ రాజ్ కి కలపడంతో ఆయన కూడా ఓకే చెప్పడంతో వెంటనే చరణ్ ఈ విషయాన్ని సల్లు భాయ్ కి చెప్పి ఒప్పించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే త్వరలోనే హైదరాబాదులో జరగబోయే షూటింగ్ లో ఏకధాటిగా సల్మాన్ ఖాన్ పై సన్నివేశాలు చిత్రీకరించనునట్లు వార్తలు వస్తున్నాయి.