న్యూస్ సినిమా

Rajamouli : రాజమౌళి ముఖ్య అతిథిగా ఛత్రపతి హిందీ రీమేక్ కి ముహూర్తం ఫిక్స్

Share

Rajamouli : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఛత్రపతి. ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రాజమౌళి రూపొందించిన ఈ సినిమాలో శ్రియ శరణ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా రాజమౌళి – ప్రభాస్ లకి తమ కెరీర్ లో గొప్ప సినిమాగా నిలిచింది. అంతేకాదు ప్రభాస్ కి ఈ సినిమా ఎంతో గొప్ప పేరు కూడా తీసుకు వచ్చింది. రాజమౌళి కి కూడా ఛత్రపతి తన కెరీర్ లో మైల్ స్టోన్ మూవీ. కాగా ఇప్పుడు ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నారు.

chatrapathi hindi remake muhurtam fix...rajamouli is as guest
chatrapathi hindi remake muhurtam fix…rajamouli is as guest

ఛత్రపతి సినిమా 2005లో రిలీజై అఖండ విజయాన్ని అందుకుంది. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అదీకాక ఈ సినిమాతో దర్శకుడు వినాయక్ తో పాటు యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ లో అడుగు పెడుతున్నారు. బాలీవుడ్ లో ఇది బాహుబలి దర్శకుడి సినిమా కూడా ప్రమోట్ చేసుకుంటున్నారు.ఇక ఈ సినిమాలో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ భారీ పర్సనాలిటీతో కనిపించబోతున్నాడు. దీనికోసం జిం లో కసరత్తులు చేసి కండలు బాగా పెంచాడు. ఇక ఇప్పటికే దర్శకుడు వినాయక్ పూర్తి బౌండ్ స్క్రిప్టుతో షూటింగ్ కి రెడీ అవుతున్నట్టు సమాచారం. కాగా ఈ సినిమాను జూలై 16న ఘనంగా ప్రారంభించబోతున్నారట. అంతేకాదు ఈ రీమేక్ పూజా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా దర్శక ధీరుడు రాజమౌళి విచ్చేస్తున్నారు. ఛత్రపతి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఈ పూజా కార్యక్రమాలకు హాజరు కాబోతుండటం అందరిలో
ఆసక్తిని కలిగించింది.

Rajamouli : బెల్లంకొండ శ్రీనివాస్ డెబ్యూ మూవీతో బాలీవుడ్ లో సక్సెస్ అవుతాడా లేదా చూడాలి.

కాగా ఈ సినిమా కోసం ఇప్పటికే హైదరాబాద్ లో భారీ సెట్ ని నిర్మించారు. ఇక్కడే ప్రాజెక్ట్ లాంఛ్ కాబోతోంది. ఈ సినిమా ఎప్పుడో మొదలవ్వాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా నిలిచిపోయింది. ఎట్టకేలకి సెట్స్ మీదకి రాబోతున్న ఈ సినిమాను పాన్ ఇండియన్ స్థాయిలో రూపొందించనున్నారట. హీరోయిన్ కూడా బాలీవుడ్ బ్యూటీని ఫైనల్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అనన్య పాండే పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పటికే అనన్య పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. కాగా బెల్లంకొండ శ్రీనివాస్ డెబ్యూ మూవీతో బాలీవుడ్ లో సక్సెస్ అవుతాడా లేదా చూడాలి.


Share

Related posts

Champika lovely looks

Gallery Desk

పెళ్లి పేరుతో రెండేళ్లుగా అత్యాచారం చేసిన ఓ డైరెక్ట‌ర్.. టీవీ న‌టి ఆరోప‌ణ‌తో వెలుగులోకి..

Teja

Pushpa: యావరేజ్ టాక్‌తో కొత్త రికార్డులు క్రియేట్ చేయడమేంటీ స్వామీ..

GRK