Kartikeya : హీరో కార్తికేయ తెలుసు కదా. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మాంచి ఫామ్ లో ఉన్న హీరో. ఆరెక్స్ 100 సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరో అయిపోయాడు కార్తికేయ. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించాడు కార్తికేయ. గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ గానూ నటించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు.

తాజాగా చావు కబురు చల్లగా అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కార్తికేయ. ఈ సినిమా ప్రస్తుతం సూపర్ డూపర్ హిట్ అయి మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి, ప్రత్యేక పాత్రలో సీనియర్ నటి ఆమని నటించింది.
ఈ సినిమాది కొత్త జానర్. హీరోయిన్ లావణ్య త్రిపాఠి… ఒక విధవ క్యారెక్టర్ ను చేసింది. ఓ వైపు సినిమా విడుదలై సంచలనాలను సృష్టిస్తుంటే… మూవీ యూనిట్ మాత్రం టీవీ షోలలో ప్రమోషనల్ కార్యక్రమాలు చేస్తోంది.
Kartikeya : స్టార్ట్ మ్యూజిక్ ప్రోగ్రామ్ లో పాల్గొన్న హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి
అయితే… తాజాగా స్టార్ట్ మ్యూజిక్ ప్రోగ్రామ్ లో చావు కబురు చల్లగా హీరో, హీరోయిన్లు పాల్గొన్నారు. సీనియర్ నటి ఆమని కూడా ఈ షోకు వచ్చారు. ఈ సందర్భంగా యాంకర్ సుమతో కలిసి వీళ్లంతా చేసిన సందడి మామూలుగా లేదు.
నువ్వు ఒక వెధవ… అని లావణ్య.. కార్తికేయతో అనగా.. అవును… ఒక విధవను ప్రేమించి… వెధవను అయ్యాను… అంటూ కార్తికేయ అనడంతో సెట్ లో మొత్తం నవ్వులే నవ్వులు. ఎంతైనా కార్తికేయ గ్రేట్. అంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా.. చాలా సింపుల్ గా ఉంటూ… అందరితో కలిసిపోయి చేసిన సందడిని చూడాల్సిందే. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. మీరు కూడా ఓ లుక్కేసుకోండి.