డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే జంటగా నటిస్తున్న ఈ సినిమా ఫైటర్. నాలుగు భాషల్లో పాన్ ఇండియా కేటగిరీలో రూపొందుతున్న ఈ సినిమాని పూరి జగన్నాధ్, ఛార్మి కలిసి నిర్మిస్తుండగా బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే కొంత టాకీ పార్ట్ కంప్లీట్ అయిన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. కాగా కరోనా క్రైసెస్ లో విజయ్ ఎంతో మందికి పేదలకి సహాయం అందిస్తున్నాడు. ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఏ మారుమూల ప్రాంతంలో ఉన్న వారికైన తమ సహాయం అందేలా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఆదుకుంటున్నాడు.
ఇక విజయ్ దేవరకొండ సొంతంగా నిర్మాణ సంస్థ ని స్థాపించి సినిమాలు కూడా నిర్మిస్తున్నాడు. కాగా త్వరలో మళ్ళీ షూటింగ్స్ ప్రారంభం కాబోతుండటం తో విజయ్ టీం కు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. దాంతో వారు అందరికీ కొన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కొంతమంది వ్యక్తులు తమకు విజయ్ టీం తో సంబంధాలు ఉన్నాయని పలు ఆడిషన్స్ కండక్ట్ చేస్తున్నట్టు ఫేక్ ప్రచారం చేస్తూ అమాయకులని మోసం చేస్తున్నారు. ఈ వ్యవహారం విజయ్ దృష్ఠికి వెళ్ళడంతో వెంటనే అలెర్ట్ అయ్యాడు.
అవన్నీ కేవలం ఫేక్ కాల్స్ మాత్రమే అని విజయ్ టీం నుంచి కానీ అతని కొత్త సినిమాకు సంబంధించి కానీ ఎలాంటి ఆడిషన్స్ ఎవరు పెట్టలేదని వెల్లడించారు. అంతేకాదు నా సినిమాకి సంబంధించిన వివరాలన్నీ అయా ప్రాజెక్ట్ నిర్మాతలు మాత్రమే ప్రకటిస్తారని తెలిపారు. విజయ్ టీం పేరిట ఆడిషన్స్ చేస్తున్నామని ఎవరైనా తెలిపితే వాటిని నమ్మి మోసపోవద్దని సోషల్ మీడియా ద్వారా విజయ్ నిర్మాతలు సహా సినీ పీఆర్వో లు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు.