దమ్మలపాటి డుమ్మా కంపెనీ..! బయటకొచ్చిన నాటి మోసం..!!

రాష్ట్రంలో దమ్మాలపాటి శ్రీనివాస్ పేరు కొద్దికాలంగా వివాదంలో నలుగుతోంది. అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ లో అవినీతి చేసారంటూ ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసింది. దీనిపై ఆయన హైకోర్టుకు వెళ్లడం.. స్టే తెచ్చుకోవడం.. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడం జరిగాయి. ఇప్పుడు ఆయనపై మరో చీటింగ్ కేసు నమోదైంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో తన పలుకుబడితో బినామీ కంపెనీ సృష్టించి కొందరిని మోసం చేసినట్టు రిటైర్డ్‌ లెక్చరర్‌ కోడె రాజా రామమోహనరావు మంగళగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో దమ్మాలపాటి శ్రీనివాస్, దమ్మాలపాటి నాగరాణి, నన్నపనేని సీతారామరాజు, కేవీజీ కృష్ణుడు, అడుసుమిల్లి తనూజ, పొట్లూరి అనంత లక్ష్మీ పేర్లను ప్రస్తావించారు.

cheating case filed on dammalapati srinivas
cheating case filed on dammalapati srinivas

దమ్మాలపాటి శ్రీనివాస్ పై వచ్చిన ఆరోపణలివీ..

కేవీజీ కృష్ణుడు అలియాస్‌ వేణు విజయవాడలోని ‘క్యాపిటల్‌ హౌసింగ్‌ ప్రాజెక్ట్ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ ఎండీ నన్నపనేని సీతారామరాజుకు నన్ను పరిచయం చేశారు. వారు నిర్మిస్తున్న ‘లేక్‌ వ్యూ అపార్ట్‌మెంట్స్‌’ ప్రాజెక్టు బ్రోచర్‌ను చూపించారు. ఈ ప్రాజెక్టులో దమ్మాలపాటి శ్రీనివాస్‌ కుటుంబానికి భాగస్వామ్యం ఉందని చెప్పారు. అక్కడే మొదటిసారి దమ్మాలపాటి శ్రీనివాస్, ఆయన భార్య నాగరాణిని కూడా కలిశాను. తాను రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌గా పనిచేస్తున్నట్టు.. ప్రభుత్వంలో ఎవరినైనా ప్రభావితం చేయగలనని, ఏ పనైనా చేయగలనని నాతో అన్నారు. దీంతో ‘లేక్‌వ్యూ అపార్ట్‌మెంట్స్‌’లో రెండు త్రిబుల్‌ బెడ్‌రూం ఫ్లాట్స్ కొనేందుకు రూ.50 లక్షలు చెల్లించాను.

దమ్మాలపాటి అండ్ కో చేసిన మోసంపై ఆయన మాటల్లో..

ఎంతో ఒత్తిడి తీసుకొచ్చాక 2019 ఫిబ్రవరి 22న ఒక ఫ్లాట్ కు కన్‌స్ట్రక్షన్‌ అగ్రిమెంట్‌ చేశారు. రెండో ఫ్లాట్‌కు త్వరలో అగ్రిమెంట్‌ పంపుతామనడంతో నమ్మి మిగిలిన మొత్తానికి 19 లక్షలు, 18.65 లక్షలు, 10.50 లక్షలకు చెక్కులు ఇచ్చాను. ఆ తర్వాత స్టార్‌ హోటల్స్‌ వస్తాయంటూ దమ్మాలపాటి శ్రీనివాస్ ఓ స్థలం చూపించారు. వారిని నమ్మి ఓపెన్‌ ప్లాట్‌ కోసం నా కుమార్తెతో 73 లక్షలు బదిలీ చేశాను. మిగిలిన రెండు ఆస్తుల రిజిస్ట్రేషన్‌ పై సమాచారం లేకపోవడంతో రిజిస్ట్రేషన్‌ సక్రమంగా చేయలేదని అక్కడ ఎలాంటి ఓపెన్‌ ప్లాట్‌ లేదని తేలింది. దీంతో లేని ప్లాట్‌కు 73 లక్షలు తీసుకున్నారని అర్థమైంది. దీంతో డబ్బు తిరిగివ్వమంటే కోర్టులు, పోలీసుల్లో తమకు పలుకుబడి ఉందంటూ సీతారామరాజు, దమ్మాలపాటి శ్రీనివాస్‌ బెదిరిస్తున్నారు.