Nithin : నితిన్ చెక్ సినిమా డిసప్పాయింట్ చేసిందా.. అవునన్న మాటే ఇప్పుడు వినిపిస్తోంది. తాజాగా యూత్ స్టార్ నితిన్ చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందిన చెక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దాదాపు సంవత్సరం తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన చెక్ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా రిలీజ్ కి ముందు కూడా పోస్టర్స్.. టీజర్.. ట్రైలర్.. లిరికల్ సాంగ్స్ తో ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీ వర్గాలలో భారీగా అంచనాలు క్రియేట్ చేసింది.
అందుకు కారణం ముఖ్యంగా డైరెక్టర్ చంద్ర శేఖర్ యేలేటి. ఆయన సినిమాలు పక్కా స్క్రీన్ ప్లే ప్రధానంగా సాగుతుంటాయి. ఐతే, అనుకోకుండా ఒకరోజు లాంటి సినిమాలు ఎంతటి డీసెంట్ హిట్ ని సాధించాయో అందరికీ తెలిసిందే. దాంతో చంద్ర శేఖర్ యేలేటి – యూత్ స్టార్ నితిన్ కాంబినేషన్ లో సినిమా అనగానే అందరిలోనూ ఆసక్తి పెరిగింది. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ చెక్ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకొని షాకిచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోతోందని మాట్లాడుకుంటున్నారు.
రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడం కష్టమని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమా తో దాదాపు 10 సినిమాలు రిలీజైనప్పటికి అందరి దృష్టి చెక్ సినిమా మీదే ఉంది. కాని ఇప్పుడు నితిన్ కూడా కాస్త డిప్పాయింట్ లో ఉన్నాడని చెప్పుకుంటున్నారట. ఇక సరిగా నెలరోజుల తేడా తో రంగ్ దే అన్న రొమాంటిక్ సినిమాతో రాబోతున్నాడు. కీర్తి సురేష్ హీరయిన్ గా నటిస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తయారవుతోంది. చూడాలి మరి నితిన్ కి ఈ సినిమా అయినా మంచి సక్సస్ ని ఇస్తుందా లేదా..!