Check : చెక్ సినిమాతో నితిన్ భారీ హిట్ కొట్టబోతున్నాడంటూ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ఆలోచిస్తే ఇది నిజమే అని ఖచ్చితంగా అనిపిస్తోంది. గత ఏడాది భీష్మ సినిమాతో సాలీడ్ హిట్ అందుకున్న నితిన్ ఆ తర్వాత ప్లాన్ చేసుకున్న ప్రాజెక్ట్స్ అన్ని పెండింగ్ పడ్డాయి. కరోనా కారణంగా పెండింగ్ పడ్డ సినిమాలు గత ఏడాది రావాల్సినవి ఈ ఏడాది సినిమాలు ఈ ఏడాది రాబోతున్నాయి. రంగ్ దే సినిమా మార్చ్ 26 న రిలీజ్ కాబోతుంది. యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
ఈ సినిమాకి పోటీగా రానా దగ్గుబాటి నటించిన అరణ్య సినిమా పోటీ ఉంది. రానా నటించిన అరణ్య పాన్ ఇండియన్ సినిమా. తెలుగుతో పాటు హిందీ .. తమిళంలో కూడా రిలీజ్ కాబోతోంది. కాగా మార్చ్ లో రంగే సినిమాతో పాటు రానా అరణ్య సినిమా కాకుండా మరో అయిదు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. కాబట్టి కాస్త రంగ్ దే సినిమాకి పోటీ ఎక్కువే ఉంది. కాకపోతే నితిన్ సినిమాకి క్రేజ్ బాగానే ఉంది. కాబట్టి హిట్ టాక్ తెచ్చుకుంటే మాత్రం గ్యారెంటీగా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ ని బాగానే రాబట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్ పరంగా.. లిరికల్ సాంగ్ పరంగా పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది.
Check : చెక్ సినిమా ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలలో సూపర్ హిట్ అన్న టాక్ వినిపిస్తోంది.
కాని సోలో సినిమాగా చెక్ ఫిబ్రవరిలో రాబోతోంది. వాస్తవంగా నితిన్ చెక్ సినిమాకి కొన్ని సినిమాలు పోటీ ఉన్నాయి. కాని ఆ సినిమాలేవి చెక్ కంటే భారీ సినిమాలు కాకపోవడం గొప్ప విషయం. ఫిబ్రవరి మొత్తం లో పేరున్న .. క్రేజ్ ఉన్న సినిమా అంటే నితిన్ చెక్ సినిమా మాత్రమే. డైరెక్టర్ చంద్ర శేఖర్ యేలేటి శైలిలో విభిన్నమైన కథ తో తెరకెక్కిన చెక్ సినిమా ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలలో సూపర్ హిట్ అన్న టాక్ వినిపిస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఫిబ్రవరి 19 న చెక్ రిలీజ్ కాబోతుండగా 3 న థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ కాబోతోంది.