NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

5 రూపాయల డాక్టర్ ఇక లేరు.. విషాదంలో చెన్నై

మీకు అదిరింది సినిమా గుర్తుందా? తమిళ హీరో విజయ్ నటించిన సినిమా అది. ఆ సినిమాలో విజయ్ 5 రూపాయలకే అందరికీ వైద్యం అందిస్తుంటాడు. ఆ సినిమా తీయడానికి స్ఫూర్తి ఎవరో తెలుసా? డాక్టర్ వి. తిరువేంకటం. అవును.. తిరువేంకటం అనే డాక్టర్ కేవలం 5 రూపాయలకే వైద్యం అందించేవారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని ఆ సినిమా తీశారు.

అయితే.. 5 రూపాయలకే పేదలందరికీ వైద్యం చేసిన ఆ డాక్టర్ ఇక లేరు. ఆయన గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. చెన్నైలో 5 రూపాయల డాక్టర్ గా ఆయన ఎంతో ఖ్యాతి గడించారు. ఆయన చనిపోయే వరకు కూడా 5 రూపాయలకే వైద్యం అందించారు.

1973లో చెన్నైలోని వ్యాసరపాడిలో ఆయన క్లీనిక్ ను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు డబ్బు సంపాదించటమే ధ్యేయంగా కాకుండా… పేదలకు సరైన వైద్యం అందాలన్న సదుద్దేశంతో ఆయన తక్కువ ఫీజుతో అన్ని రకాల వైద్యాలు చేసేవారు. అందుకే తన వైద్యానికి ఆయన కేవలం 5 రూపాయలు మాత్రమే తీసుకునేవారు.

తన వైద్య వృత్తిలో భాగంగా ఆయన ఏనాడూ సెలవు తీసుకోలేదట. ప్రతి రోజు తన క్లీనిక్ కు వచ్చే రోగులకు వైద్యం అందించేవారు. ఒక్క లాక్ డౌన్ సమయంలోనే తిరువేంకటం క్లీనిక్ ను నెల రోజుల పాటు మూసేశారట. ఆ తర్వాత కూడా ఆయన తన క్లీనిక్ ను తెరిచి పేదలకు వైద్యం అందించారు.

తను తీసుకున్న 5 రూపాయలను కూడా మెడిసిన్స్ కొనుక్కోలేని పేదల కోసం ఆయన ఖర్చు పెట్టేవారు. అలా దాదాపు 45 ఏళ్ల పాటు చెన్నై, చుట్టు పక్కల వాసులకు వైద్య సేవల్ని అందించారు.

వైద్య వృత్తిని వ్యాపారం చేసి కోట్లు గడిస్తున్న ఈరోజుల్లో కేవలం 5 రూపాయలకే ఎంతో ఖరీదైన వైద్యం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన ఈ డాక్టర్ కు మనమంతా సలాం కొట్టాల్సిందే.

author avatar
Varun G

Related posts

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?