ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లా పర్యటన

విజయవాడ,జనవరి2: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనకు వెళ్లారు. కుప్పం ఎన్టీర్ క్రీడా వికాస కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహింస్తున్న ఆరవ విడత జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. వడ్డెపల్లి గ్రామంలో పాదయాత్ర చేస్తారు. ఆనంతరం ప్రభుత్వం పేదలకు నిర్మించిన గృహాలను ప్రారంభించనున్నారు. ఆ తదుపరి  హార్టీకల్చర్ హబ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్సును ప్రారంభించనున్నారు. పోలీ హౌస్ సందర్శించి రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.