Chikoti Praveen: క్యాసినో నిర్వహకుడు చీకోటి ప్రవీణ్ మరో సారి ఈడీ (ఎన్ ఫోర్సమెంట్ డైరెక్టరేట్) అధికారుల ముందు హజరైయ్యారు. థాయ్ లాండ్ క్యాసినో కేసులో అక్కడి పోలీసులకు పట్టుబడిన చీకోటి ప్రవీణ్ అక్కడి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదల అయ్యారు. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు విచారణకు హజరుకావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల నేపథ్యంలో సోమవారం చీకోటి ప్రవీణ్ హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయానికి విచారణకు హజరైయ్యారు.

థాయ్ లాండ్ లో క్యాసినో ఆడేందుకు భారత్ నుండి వెళ్లిన వారిని ఆ దేశ పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. చీకోటి ప్రవీణ్ తో పాటు దేవేందర్, మాధవరెడ్డి, సంపత్ లకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే ట్రావెల్ ఏజంట్ సంపత్ ఈడీ విచారణకు హజరైయ్యారు. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో హవాలా కు అస్కారం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో.. ఆర్దిక లావాదేవీలతో పాటు నగదు బదిలీ పై చీకోటి ప్రవీణ్ ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. కాగా క్యాసినో చేసులో గతంలో చీకోటి ప్రవీణ్ ను ఈడీ విచారించింది.
Breaking: ఘోర రోడ్డు ప్రమాదం .. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
Prabhas: ప్రభాస్ బాడీ గురించి సంచలన కామెంట్స్ చేసిన బాలీవుడ్ హీరో..!!