Child Labour: 12 ఏళ్ళ వయస్సులో ఒక బాల కార్మికుడు కన్న కల… 30 ఏళ్లకు 1500 చిన్న బిడ్డలను కాపాడింది..! 

Child Labour eradication by Vikasana NGO is exemplary
Share

Child Labour: కర్ణాటకలోని చిక్మగళూరు జిల్లా ప్రకృతి ప్రేమికులకు స్వర్గం లాంటి చోటు. పచ్చదనంతో నిండి ఉండే ఇక్కడ జలపాతాలు, జంతు సంపద, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలతో పాటు దట్టమైన కాఫీ చెట్లు కూడా ఉంటాయి. అయితే పైకి స్వర్గంగా కనిపించినా… లోతుగా చూసిన వారికే అక్కడి బాల కార్మికుల కష్టాలు తెలుస్తాయి. ఇటువంటి కాఫీ చెట్ల మధ్య తన బాల్యాన్ని గడిపాడు ఏ ఎన్ వర్గీస్.

 

Child Labour eradication by Vikasana NGO is exemplary

 

చదువు ని మాత్రం వదిలేది లేదు..!

ఏ ఎన్ వర్గీస్ ఒక ఒక సామాజిక కార్యకర్త. చిన్నప్పుడు బాలకార్మికుడిగా తాను అనుభవించిన వ్యధని దృష్టిలో పెట్టుకొని వేలాది బిడ్డల భవిష్యత్తు ను కాపాడేందుకు బయలుదేరిన సామాజికవేత్త. వర్గీస్ తండ్రి కూలి పని చేసేవాడు. నలుగురు ఉండే కుటుంబాన్ని కూడా మూడు పూట్ల తిండి పెట్టి పోషించలేని వర్గీస్ తండ్రి ఏడవ తరగతి చదివేటప్పుడు ఆర్థికంగా తనకు సహాయం కోసం కొడుకును కూడా పనికి పంపించాడు. అయితే పిల్లవాడు మాత్రం మిగిలిన వారిలా చదువును పూర్తిగా వదిలేయకుండా అటు పని… ఇటు పుస్తకాలు రెండూ మేనేజ్ చేస్తూ వచ్చాడు. అలా సోషియాలజీ (సామాజిక శాస్త్రం) లో తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.

 

తలరాత మారేది ఇలానే…!

“మొదట నేను నా స్నేహితులతో కలిసి ఉండేందుకు బడికి వెళ్ళాలి అనుకున్నాను. అయితే చదువు యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని పాఠశాలకు వెళ్ళడం మొదలు పెట్టాను. అప్పుడప్పుడు పని ఉండడంవల్ల స్కూల్ కి కూడా వెళ్లలేకపోయేవాడిని. కానీ హాజరు కాలేని క్లాసులకి ఎక్కువ సమయం వెచ్చించి చదివేవాణ్ణి. బడి మానేయాలని లేకపోయినా కొన్ని అత్యవసర పరిస్థితుల్లో కుటుంబానికి అండగా ఉండేందుకు వెళ్లలేకపోయాను కానీ ఆ పాఠాలను రాత్రిపూట సొంతంగా చదువుకునే వాడిని. ఎన్నో గంటలు పని చేసినప్పటికీ జీతం చాలా తక్కువ ఉండేది. జీవితం అలా అంధకారం నడుస్తూ ఉన్నప్పుడు కేవలం చదువు, మంచి మార్కులే నా తలరాతను మార్చగల అని నిర్ణయించుకున్నాను,” అని చెప్పుకొచ్చాడు వర్గీస్.

Child Labour: దానికే జీవితం అంకితం

అలా సామాజిక శాస్త్రంలో పీజీ పూర్తి చేసిన వర్గీస్ ఎన్నో ఎన్జీవోలతో కలిసి తన జిల్లాలో పని చేశాడు. దాదాపు స్త్రీ శిశు సంక్షేమం కోసమే తన పదేళ్ళ జీవితాన్ని త్యాగం చేశాడు. ఆ తర్వాత 1989లో ‘వికాసన’ అనే తన సొంత ఎన్జీవో ఆర్గనైజేషన్ ను తన ఊరి నుండి మొదలు పెట్టాడు. స్వతహాగా బాలకార్మికుడు అయిన వర్గీస్ తన జిల్లాలో ఉండే పరిస్థితులకి అనుగుణంగా ఎన్నో క్యాంపులు నిర్వహించి పిల్లలని అలా చట్టవిరుద్ధంగా పనిలో పెట్టే వారినుండి కాపాడాడు. తర్వాత 1989 లో ‘వికాసన’ స్థాపించాడు. అతని తో పాటు మరొక ఏడుగురు కలిసి గత 30 సంవత్సరాలుగా తన జిల్లాలో అసలు బాల కార్మికులు అనేవారే లేకుండా ఉండేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇప్పటివరకు వర్గీస్ స్థాపించడం ఎన్జీవో 1500 పిల్లలని పని నుండి తప్పించి వారికి చదువుకునే వెసులుబాటు కల్పించారు. వారిలో ఎంతో మంది లాయర్లు, ఇంజనీర్లు, టీచర్లుగా స్థిరపడ్డారు.

 

మనదేశంలో ఇదేమైనా కొత్తా?

వర్గిస్ తన ఎన్జీవో తో జరిపిన ఒక సర్వే ప్రకారం 1990 నుండి 2001 మధ్యలో దాదాపు 3 వేల మంది పిల్లలు ఈ కాఫీ ఎస్టేట్ల లో పని కోసం చేర్పించబడ్డారు. అంతేకాకుండా ఇసుక బట్టీలలో, అరక గింజలు తయారుచేసే తోటలో రాష్ట్రమంతా వీరు బలవంతంగా పని లో చేర్పించబడ్డారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో… బాల కార్మిక అనుసరణ కు విరుద్ధంగా ఒక క్యాంపెయిన్ చేపట్టారు. అసలు ఆరోగ్యానికి అనువుగా సురక్షితంగా లేనిచోట్ల చిన్నపిల్లలను బలవంతంగా పనికి పంపించడం… వారి చేత అక్కడ గంటలు గంటలు పని చేయించడం భారతదేశంలో కొత్తేమీ కాదు. 

ఆరు సంవత్సరాల వయస్సులో ఉన్న పిల్లల కి చాలా తక్కువ ధర చెల్లించి వారితో గంటల తరబడి పని చేయించుకోవడం రోజుకి ఒక పూట భోజనం మాత్రమే పెట్టడం చాలా చోట్ల సర్వసాధారణం. ఎంతోమంది పేద తల్లిదండ్రులు… తమ బిడ్డల చదువు తమ దారిద్ర్యాన్ని తొలగిస్తుంది అని తెలియక ఆ వచ్చే నాలుగు పైసల కోసం పిల్లలను పనికి పంపిస్తుంటారు. ఇక వారి అప్పులు తీర్చేందుకు భూస్వాముల దగ్గరే పిల్లలను పనిలో చేర్పించి ఎప్పటికీ వారి వద్ద బానిసలుగా పని చేస్తూ ఉంటారు. పెరిగే ధరలకి, వీరికి ఇచ్చే జీవితానికి అసలు సంబంధం ఉండదు. అలా తరాల తరబడి దీనికి అలవాటు పడిపోయిన తల్లిదండ్రులకు, పిల్లలకు నచ్చ చెప్పి వారిని పని నుండి మార్పించడం అంతా సులువైన పని ఏమీ కాదు. కానీ వికాసన నా మాత్రం 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న ప్రతి ఒక్క కార్మికుడిని గుర్తించి అంగన్వాడి వర్కర్స్, లోకల్ ఆఫీసర్స్, స్కూల్ టీచర్లు, పోలీస్ సహాయంతో వారిని బడికి పంపించారు.

పట్టాడు పట్టు… ఎక్కించాడు ఒక్కో మెట్టు 

కానీ ఇన్ని వేల మంది పిల్లలను బడిలో చేర్పించాలి అంటే ఎన్ని పాఠశాలలు కట్టాలి? అందుకే వీరికి ట్యూషన్లు ఏర్పాటు చేశారు. ఆసక్తి ఉన్న యువకులను, యువతులను వారికి క్లాసులు చెప్పేందుకు ప్రేరేపించారు. 20, 30, 50 మొదలుకొని ఎన్నో వందల మందికి తమ భవిష్యత్తు మార్చుకునే అవకాశాన్ని కల్పించారు. ఇప్పుడు వారు రక్షించిన పిల్లలు ఎంతో మంది నర్సులు గా, టీచర్లుగా, బడి ప్రిన్సిపల్స్ గా, క్యాబ్ డ్రైవర్లు గా, కంప్యూటర్ ఆపరేటర్లు గా ఇంజనీర్లుగా తన జీవితాన్ని హాయిగా గడుపుతున్నారు. ‘వికాసన’ వంటి సంస్థల వల్ల గత పది సంవత్సరాలలో ఆ జిల్లాలో బాలకార్మికుల సంఖ్య 50 శాతం కంటే తక్కువ పడిపోయింది. ఇక మిగిలిన వారందరినీ ఆ దారిద్ర్యం నుండి కాపాడడమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చాడు వర్గీస్.


Share

Related posts

Sudigali Sudheer : యాంకర్ గా మారిన సుధీర్.. రంగు పడుద్ది అంటూ రచ్చ రచ్చ చేశాడు?

Varun G

జగన్ అనే నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా: 2024లో కూడా ఇలా జరగాలంటే..??

sekhar

Pawan Kalyan: చిరంజీవి మూవీ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పవన్ పని చేసిన సినిమా ఏంటో తెలుసా..??

sekhar