చైనా వైరస్ కి… చైనా టీకా మంచి ఫలితాలనే ఇచ్చినట్టుంది..!!

 

ప్రపంచ వ్యాప్తంగా వణుకు పుట్టిస్తున్న కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనుగొనే దశలో తొలి వ్యాక్సిన్ తయారీ సంస్థగా సినోవాక్ నిలిచింది. చైనాకు చెందిన సినోవాక్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వైరస్ వ్యాక్సిన్ చివరి దశ ప్రయోగాల్లో అనుకూల ఫలితాలు వచ్చినట్లు వెల్లడయింది.

బ్రెజిల్ కు చెందిన ప్రముఖ బయో మెడికల్ పరిశోధన కేంద్రమైన సావోపాల్ బూటంటన్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఈ ఈ వ్యాక్సిన్‌ను ఇప్పటి వరకూ రెండు దశల క్లినికల్ ట్రయిల్స్ పూర్తి కాగా ఇది మూడవది. ఇక వ్యాక్సిన్ మొదటి డోసు తరువాత ఇంజెక్షన్ కారణంగా 20 శాతం మందిలో కొద్దిపాటి నొప్పి ,15 శాతం మంది లో తలనొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. రెండవ డోసులో 10 శాతం మందిలో తలనొప్పి 5 శాతం వారిలో అలసట, వికారం,కొద్దిగా కండరాల నొప్పులు వంటివి లక్షణాలు కనిపించాయి. మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా 9 వేల మంది వాలంటీర్ల పై రెండు డోసులుగా కరోనా వ్యాక్సిన్‌ను  ఇచ్చామని తెలిపింది. అలాగే ఎవరు తీవ్ర అస్వస్థతకు గురికాలేదని ఇనిస్టిట్యూట్ ఉన్నతాధికారులు వెల్లడించారు.
బ్రెజిల్ లో చివరి దశకు సంబంధించిన క్లినికల్ ప్రైస్ ప్రాథమిక ఫలితాలు సోమవారం వెల్లడి కావడంతో ఈ దశకు చేరుకున్న తొలి వ్యాక్సిన్ తయారీ సంస్థగా సినోవాక్ నిలిచింది. ఇప్పటి వరకు ట్రయిల్స్ లో పాల్గొన్న 15 వేల మందిపై వ్యాక్సిన్ ప్రయోగాలు పూర్తయిన తరువాత వైరస్ కట్టడికి వ్యాక్సిన్ సమర్ధత కు సంబంధించిన వివరాలు తెలుపుతామన్నారు బూటాంటన్ డైరెక్టర్.  దీనిపై సావో పాలో స్టేట్ హెల్త్ సెక్రటరీ మాట్లాడుతూ ఈ వ్యాక్సిన్ శరీరంలో యాంటీబాడీలను తయారు చేస్తుందని చెప్పారు. ఈ సంవత్సరం చివరి కల్లా వ్యాక్సిన్ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నామనీ, 2021 ప్రారంభం నాటికి ప్రజలందరికీ ఈ వ్యాక్సిన్‌ను అందించాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.