NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

137 దేశాల కత్తి..!! జిన్ పింగ్ దిగడం ఖాయమే..? చైనాకు ముప్పు..!!

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రపంచానికి తెలిసిన వ్యక్తి, చైనాలో పెద్ద శక్తి..! వరుసగా తనే అధ్యక్షుడిగా అయిపోయి దేశాన్ని గుప్పిట్లో పెట్టుకుని, లోకాన్ని ఏలాలనుకుంటున్న చైనా దేశపు కమ్యూనిష్టు..! ఇక ఇతని పని అయిపోయినట్టేనా..?? ఇక పీఠం దిగాల్సిందేనా..? రాజీనామా చేసి, తట్టా, బుట్టా సర్దుకోవాల్సిందేనా..??

చైనాకి కూడా ముప్పు రాబోతోందా..? కరోనా విషయంలో చైనా ఎదుర్కొన బోతున్న అతి పెద్ద ముప్పు ఏంటి..? ప్రపంచ దేశాలు ప్రస్తుతం వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు ఏంటి..? చైనాని ఎలా ఎదుర్కొనబోతున్నారు..? అనేది బ్రిటన్ పత్రిక “express ” ఒక కథనాన్ని ప్రచురించింది. దాని విశ్లేషణలు, జరుగుతున్నా పరిణామాలు, ఇటీవల సంగతులు పరిశీలిస్తే చైనాకు ఉన్న ముప్పు చెప్పుకోవచ్చు.

“కరోనా ప్రపంచాన్ని అల్లాడిస్తుంది. తొమ్మిది లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. ఆర్ధికాన్ని ముంచేసింది. మధ్యతరగతి జీవనాల్ని అతలాకుతలం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 40 కోట్ల మందికి ముద్ద లేకుండా చేసింది. మరిన్ని చావులు తప్పవని హెచ్చరికలు వస్తున్నాయి. అంతటి విలయ కరోనా ఎక్కడిది..? తయారు చేశారా..? స్వతహాగా వచ్చిందా…? ల్యాబ్ లో తయారు చేసి వదిలారా..? గబ్బిలాలు నుండి పుట్టిందా..? అనేది ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. కానీ…!!

పుట్టినా..? పెంచినా..? తప్పు తప్పే..!!

కరోనాకి కారణం చైనా అనేది ప్రపంచానికి తెలుసు. స్వతహాగా పుడితే సగం పాపం.., కృత్రిమంగా ల్యాబ్ లో తయారు చేస్తే మహా పాపం..! ఈ పాపానికి ప్రాయశ్చిత్తం తప్పదు. కరోనా ఎలా వచ్చినా దీన్ని అంచనా వేసి, ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలో చైనా నిర్లక్ష్యం ఉంది అనేది ప్రపంచం గుర్తించింది. నవంబరులోనే చైనాను తాకినా కరోనాపై జనవరి రెండో వారం వరకు ప్రపంచ దేశాలకు చైనా అప్రమత్తం చేయలేదు. అదే చైనా చేసిన పెద్ద తప్పు అని ముఖ్య దేశాలుగా ఉన్న అమెరికా, బ్రిటన్, రష్యా, జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు ఇప్పటికే చైనాని తీవ్రంగా తప్పు పడుతున్నాయి. అందుకే ఇలాగే ఊరుకోకుండా చైనాపై ప్రతాపం చూపడానికి ఏకమవుతున్నాయి. ఇప్పటికే అమెరికా ప్రపంచ ఆరోగ్య సంస్థకి నిధులు ఆపేసింది. ఆస్ట్రేలియా అయితే కరోనాపై చైనా ప్రపంచానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తుంది. ఇండియాతో చైనాకి సరిహద్దులు గొడవలు సరేసరి. ఈ నేపథ్యంలో చైనాకి వ్యతిరేకంగా శక్తులు ఏకం అవుతున్నాయి అనడంలో ఎటువంటి సందేహాలు అక్కర్లేదు.

137 దేశాలు ఏకమవుతున్నాయ్..!!

ప్రపంచ ఆరోగ్య సభ (World Health అసెంబ్లీ ) లో 137 సభ్యదేశాలున్నాయి. కరోనా విషయంలో చైనా నిర్లక్ష్యాన్ని, కుట్రని బయటపెట్టేందుకు ఈ దేశాలన్నీ కంకణం కట్టుకున్నాయి. ఇప్పటికే ఓ కమిటీని కూడా వేసాయి. “స్వతంత్ర ప్యానెల్” అనే పేరిట దేశాల ముఖ్యులు కమిటీగా ఏర్పడి కరోనాపై అధ్యయనం ఆరంభించారు. దీనికి న్యూజిలాండ్ మాజీ ప్రధాని హెలెన్ క్లార్క్ అధ్యక్షత వహిస్తుండగా.., లైజీరియా, కెన్యా దేశాల ప్రముఖులూ ఉన్నారు. ఈ కమిటీ నివేదిక వచ్చిన వెంటనే చైనా పని పట్టేందుకు ఈ 137 దేశాలు ఏకాభిప్రాయంతో ఉన్నాయి.

ముందుగానే అప్రమత్తమైన చైనా..!!

ప్రపంచ దేశాలు ఏకమవుతుంటే.., తమపై తిరుగుబావుటా ఎగరవేస్తే చైనా ఎందుకు ఊరుకుంటుంది. ముందస్తుగా తమకు అందిన సమాచారంతో అప్రమత్తమైంది. ఇప్పటికే ఆహార, ద్రవ్య, ఆర్ధిక, ఉపాధి సంక్షోభంలో ఉన్న చైనాలో అధ్యక్షుడి తీరుపై కొద్దీ కాలంగా విమర్శలు వస్తున్నాయి. రాజకీయ సంక్షోభం కూడా ఉంది. అందుకే జిన్ పింగ్ ని దించేయడమే చైనా తక్షణ కర్తవ్యమ్. అయినా ప్రపంచ దేశాలు ఆగే అవకాశాలు స్వల్పమే. జిన్ పింగ్ ప్రధాన శత్రువు కాదు, చైనా స్వభామ, చైనా వైరస్ మాత్రమే ప్రపంచ శత్రువు ఇప్పుడు. అందుకే ఒక స్పష్టత వచ్చిన తర్వాత చైనాని దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవేమి లేకుండా మొదట్లోనే అమెరికా చైనాని నిందించి ప్రపంచ ఆరోగ్య సంస్థని నిందించి నిధులు ఆపేసారు. అమెరికా అక్కడితో ఆగింది. ప్రపంచం ఇప్పుడు మరింత ముందుకు వెళ్లబోతుంది. నివేదిక వచ్చిన అనంతరమే కీలక సమావేశం ఏర్పాటు చేసుకుని, తదుపరి ప్రణాళిక ఉండబోతుంది అనేది ” Express ” కథన సారాంశం.!

 

 

 

 

author avatar
Srinivas Manem

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju