NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

చైనాకు గూఢచారిగా వ్యవహరిస్తున్న జర్నలిస్టు ?

 

(న్యూఢిల్లీ నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి)

జర్నలిస్టుగా పనిచేస్తూ భారత రహాస్యాలను చైనాకు చేరవేస్తున్న ఆరోపణలపై రాజీవ్ శర్మ అనే ఫ్రీలాన్స్ జర్నలిస్టును ఢిల్లీ పోలీసులు ఇటివల అరెస్టు చేశారు. అతనితో పాటు అతనికి సహకరిస్తున్న మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. రక్షణ రంగానికి చెందిన అనేక కీలక పత్రాలు అతను కలిగి ఉన్నాడన్న అరోపణలపై పోలీసులు రాజీవ్ శర్మను అరెస్టు చేశారు. భారత రక్షణ రంగానికి చెందిన పలు రహస్యాలను అతను చైనాకు చెరవేస్తున్నాడని, దానికి ప్రతిఫలంగా రాజీవ్ శర్మ భారీ మొత్తంలో నగదు పొందుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఇతడు జర్నలిస్టుగా గతంలో యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా, ద ట్రిబ్యూన్, సకాల్ టైమ్స్ పత్రికల్లో పనిచేశాడు. ప్రస్తుతం ఫ్రీ లాన్స్ జర్నలిస్టుగా పనిచేస్తూ… ఇటివల చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ అనే పత్రికకు ఓ వ్యాసం కూడా రాసినట్లు గుర్తించారు. జర్నలిస్టు ముసుగులో గూఢచర్యంకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు రావడంతొ ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టారు. షల్ కంపెని ద్వారా అతడికి నగదు చెల్లిస్తున్నట్లు గుర్తించారు. ఓ మహిళతో పాటు నేపాల్ కు చెందిన మరొ వ్యక్తిని కూడా రాజీవ్ శర్మతో పాటు అరెస్టు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుండి ల్యాప్ టాప్ లు, మొబైల్ ఫోన్లు, ఇతర కీలక పరికరాలు, పత్రాలు స్వాదీనం చేసుకున్నట్లు ఢిల్లీ స్పెషల్ సెల్ డీసీపీ సంజీవ్ కుమార్ తెలిపారు. నిందితులను కోర్టు ఆరు రోజులు పోలీస్ కష్టడీ విధించినట్లు చెప్పారు.

భారత, చైనా భూ బాగాల మధ్య సరిహద్దులలో వివాదం రోజు రోజు కు ఎక్కవ అవుతుంది. భారత భూబాగాన్ని ఎప్పుడెప్పడు అక్రమిద్దామ అనే విధంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. అదే విధంగా భారత దేశ సరిహద్దు దేశాలను తనవైపు తిప్పుకోవడానికి చేయని ప్రయత్నాలు లేవు. భారత ఆర్ధిక వ్యవస్థను దెబ్బ తీయడానికి అనేక పన్నాగాలు వేస్తుంది. డ్రాగన్ చైనా దుశ్చర్యలకు భారత్ కూడా ఘాటుగానే తిప్పి కొడుతుంది. చైనా కి సంబంధిచిన అనేక వస్తువులను ఇండియా నిలిపి వేసింది. చైనాకు ఎంతో లాభాలను అర్జించి పెడుతున్న టిక్ టాక్, పబ్జి వంటి అనేక యాప్ లను భారత్ బ్యాన్ చేయడంతో చైనా నోట్లో పచ్చి వెళక్కాయ పడినట్లు అయింది. ఈ తరుణంలో దేశ రాజధాని ఢిల్లీలో చైనాకు భారత దేశ రక్షణ శాఖకు చెందిన అనేక కీలక అంశాలు చేరవేస్తున్న ఫ్రీలాన్స్ జర్నలిస్టు రజీవ్ శర్మ వ్యవహారం బయటకు రావడంతో భారత రక్షణ రంగం ఒక్క సారిగా ఉలిక్కి పడింది. చైనాకు ఏ విధమైన సమాచారాన్ని అందించాడు? అతని దగ్గర రక్షణ రంగానికి సంబందించిన ఏ ఏ పత్రాలు ఉన్నాయి ! అనేది తెలియాల్సి ఉంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ను చైనా వారే కావాలని ప్రపంచం మీదకు వదిలారనే అంశంపై ప్రపంచ దేశాలు అన్ని కూడా చైనా పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే సమయంలో భారత దేశానికి అగ్ర రాజ్యమైన అమెరికాతో పాటు పలు దేశాలు తమ మద్దతు తెలుపడంతో చైనా మీ మాంస లో పడింది.

author avatar
Special Bureau

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju