ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ కు చైనానే కారణమని బలంగా నమ్ముతున్నాయి. ఇప్పటికే ఆ దేశంతో లావాదేవీలు కూడా ముగించాలన్న ఉద్దేశంతో ఉన్నాయి. ఈలోగానే చైనా ఒక సంచలన ప్రకటనతో ముందుకు వచ్చింది. కరోనాకు వాక్సిన్ ను కనుగొన్నట్లు ప్రకటించింది.
అన్ని రకాల ప్రయోగాలు దాటుకుని వాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చినట్లు కిన్సినో బయో వ్యాక్సిన్ లిమిటెడ్ అధికారికంగా ప్రకటించింది. ఈ సంస్థ మాత్రమే కాకుండా చైనాకే చెందిన మరో రెండు రకాల వాక్సిన్స్ వూహాన్, సినోవాక్ మూడో దశ ప్రయోగాల్లో ఉన్న విషయం తెల్సిందే. చైనా నుండి కరోనాకు వాక్సిన్ మొదట అందుబాటులోకి వస్తే దానికి డిమాండ్ మాములుగా ఉండదు. ఇక మరోవైపు బ్రిటన్ ప్రభుత్వ సహకారంతో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రూపొందిస్తున్న వాక్సిన్ గురించి కూడా ప్రపంచమంతా ఎదురుచూస్తోంది.