NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

పెద్దాపురంలో నిమ్మ‌కాయ‌ల చినరాజప్ప హ్యాట్రిక్‌కు డౌట్లు ఉన్నాయా…!

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం పెద్దాపురం. ఇక్క‌డ నుంచి వైసీపీ అభ్యర్థిగా దవులూరు దొరబాబు పోటీ చేస్తున్నారు. ఆయ‌న పేరు ప్ర‌క‌టించ‌డ‌మే త‌రువాయి. అయితే.. ఆయనపై టీడీపీ అభ్యర్థిగా ప్ర‌స్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే , మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప బరిలోకి దిగుతు న్నారు. 2014, 2019లలో వరుసగా రెండుసార్లు పెద్దాపురం నుంచి చిన‌రాజ‌ప్ప విజయం సాధించారు. ముచ్చటగా మూడోసారి గెల‌వాల‌నేది చిన‌రాజ‌ప్ప ల‌క్ష్యం.

ఆదిశ‌గానే ఆయ‌న అడుగులు వేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. 2014లో చంద్రబాబు నాయుడు ప్రభు త్వంలో…హోం శాఖ మంత్రిగా పని చేశారు. పార్టీ ఆవిర్బావం నుంచి తెలుగుదేశంలో పార్టీలో కొనసాగుతు న్నారు. సుదీర్ఘకాలం పాటు తూర్పు గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పని చేసిన అనుభవం ఉంది. అందుకో కోన‌సీమ ప్రాంతానికి చెందిన రాజ‌ప్ప‌కు 2014లో చంద్ర‌బాబు పెద్దాపురం సీటు కేటాయించ‌డం ఆయ‌న గెల‌వ‌డం.. ఆ వెంట‌నే బాబు ప్ర‌భుత్వంలో ఆయ‌న‌కు కీల‌క‌మైన హోం మంత్రి ప‌ద‌వి ద‌క్క‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి.

ఇక గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వ యాంటీ వేవ్ త‌ట్టుకుని ఆయ‌న పెద్దాపురంలో వైసీ పీ నుంచి పోటీ చేసిన తోట వాణి పై 4 వేల ఓట్ల స్వ‌ల్ప తేడాతో విజ‌యం సాధించారు. అన‌ప్ప‌టికీ.. ఈ ద‌ఫా గెలుపు అంత ఈజీకాద‌నే అభిప్రాయం రాజ‌ప్ప వ‌ర్గీయుల్లో వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త నేప‌థ్యంలో టీడీపీ నాయ‌కులు విజ‌యం ద‌క్కించుకుంటార‌నే అంచ‌నా ఉంది.

కానీ, వ‌రుస విజ‌యాలు అందించినా.. చిన‌రాజ‌ప్ప త‌మ‌కు ఏమీ చేయ‌లేక‌పోయార‌న్న వాద‌న పెద్దాపురం లో క‌నిపిస్తుండడం గ‌మ‌నార్హం. దీనికి తోడు.. నియోజ‌క‌వ‌ర్గంలో అన్ని వ‌ర్గాల వారికీ.. ముఖ్యంగా టీడీపీ సానుకూల ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకున్న దొర‌బాబు.. వారికి ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అందేలా చేశారు. దీంతో చిన‌రాజ‌ప్ప మూడోసారి విజ‌యం ద‌క్కించుకుంటారా? అనేది ప్ర‌శ్న‌గా మారింది. నిజానికి వైసీపీ ఆవిర్భావం తర్వాత ఈ నియోజకవర్గంలో గెలవలేదు.

గత రెండు ఎన్నికల్లోనూ వైసీపీకి ఘోర ప‌రాభ‌వ‌మే ఎదురైంది. మ‌రోవైపు దొరబాబు మాత్రం ఈ నియోజ క‌వ‌ర్గంలో వైసీపీ జెండా పాతి సీఎం జ‌గ‌న్‌కు కానుక‌గా ఇస్తామ‌ని ప్ర‌క‌టిస్తున్నారు. యువ‌త‌ను త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాలను విరివిగా అందించారు. వ‌లంటీర్ల‌ను పూర్తిగా త‌న క‌నుస‌న్న‌ల్లో పెట్టుకున్నారు. ఎక్క‌డ ఏం జ‌రిగినా.. చిటికెలో త‌న‌కు తెలిసేలా.. ఆయ‌న వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతున్నారు. దీంతో వైసీపీవ‌ర్సెస్ టీడీపీ మ‌ధ్య అయితే.. గ‌ట్టిపోటీ లేక పోతే ఏక‌ప‌క్షంగానే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

author avatar
BSV Newsorbit Politics Desk

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju