Chintamaneni: ఏపీ డీజీపీ పై సీరియస్ కామెంట్స్ చేసిన చింతమనేని..!!

Share

Chintamaneni: నిన్న ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ దెందులూరు మాజీ ఎమ్మెల్యే టిడిపి రెబెల్ నేత చింతమనేని పై మొత్తం కేసులో లెక్కలు బయట పెట్టిన సంగతి తెలిసిందే. దాదాపు 85 పైగా కేసులు 1995 నుండి నమోదైనట్లు తెలిపారు. వాటిలో 17 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు తో పాటు ప్రభుత్వ అధికారుల పై చేయి చేసుకున్న కేసులు మరియు వనజాక్షి ఎమ్మార్వో ని కొట్టిన కేసు .. 2019 ఎన్నికలకు ముందు ఫాల్స్ కేస్ గా కొట్టేసినట్లూ పేర్కొన్నారు. పరిస్థితి ఇలా ఉండగా.. తాజాగా తన పై గౌతమ్ సవన్ చేసిన ఆరోపణలకు మీడియా సమావేశం నిర్వహించి చింతమనేని ప్రభాకర్ తనదైన శైలిలో కౌంటర్లు వేశారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ముఖ్యమంత్రి జగన్ ని ప్రసన్నం చేసుకోవడానికి.. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.Gautam Sawang gets DGP baton as Ravindra will become Intelligence chief in  Andhra Pradesh- The New Indian Express

ఏబీ వెంకటేశ్వరరావు మాదిరి  గౌతమ్ సవాంగ్ తన పరిస్థితి అన్న  తరహాలో వాటి నుండి తప్పించుకోవటానికి.. తన గురించి లేనిపోని ఆరోపణలు చేశారని..సీఎం మెప్పు కోసమే అని  మండిపడ్డారు. అంతే కాకుండా తనని బయటి సమాజానికి ఒక బూచిగా చూపించడానికి నేరస్థుడిగా చిత్రీకరించడానికి ఇష్టానుసారంగా.. వ్యాఖ్యలు చేశారని సీరియస్ అయ్యారు. తనపై నమోదైన కేసులో మొత్తం రాజకీయ పరమైన వి మాత్రమే అని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఒక స్పెషల్ కోర్టు పెట్టి తనపై ఉన్న కేసులు త్వరితగతిన కంప్లీట్ చేయాలని డిమాండ్ చేశారు.

 

అదే రీతిలో ఏపీ పోలీసుల వల్ల తనకు ప్రాణహాని ఉందని ఈ విషయంలో న్యాయస్థానానికి వెళ్లి సెంట్రల్ నుండి ఇద్దరు గన్ మెన్ లను.. సెక్యూరిటీ గా పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కావాలని జగన్ ప్రభుత్వం కక్ష గట్టి తనపై లేనిపోని కేసులు పెడుతున్నట్లు చింతమనేని తెలియజేశారు. అంతమాత్రమే కాకుండా ఏపీ పోలీసులు వైసీపీ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని.. ఇది అన్యాయం అంటూ చింతమనేని మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.


Share

Related posts

Etela Rajender: నియోజకవర్గంలో ఈటల బలప్రదర్శన ర్యాలీ..! కేసిఆర్ పై  సీరియర్ కామెంట్స్.. !!

somaraju sharma

రాష్ట్రపతి భవన్ లో పనిచేస్తున్న సిబ్బందికి కరోనా పాజిటివ్

Siva Prasad

కుప్పకూలిపోయిన ఇజ్రాయిల్ ప్రభుత్వం..!!

sekhar