Chiranjeevi Acharya : మెగాస్టార్ చిరంజీవి హీరోగా మినిమమ్ గ్యారెంటీ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. ఇటీవలే ఈ చిత్రం టీజర్ విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంతే కాకుండా ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన ధర్మస్థలి టెంపుల్ సెట్ లో ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. భారత దేశంలోనే ఇదే అతి పెద్ద సెట్ అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో అనేక విశేషాలు ఉన్నాయి.
చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ చిత్రంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ పాత్ర పేరు సిద్ధ అని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చిరు-చరణ్ పైన మారేడుమిల్లి అడవి లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం మరొక క్రేజీ అప్డేట్ బయటికి వచ్చింది. ఈ సినిమాలో మరొక ప్రముఖ పాత్రను ఉందట. దీనికోసం ఇతర భాషల్లో ఒక సూపర్ స్టార్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారని సమాచారం.
‘సైరా’ సినిమాలో కనిపించి మెప్పించిన కిచ్చ సుదీప్ ను ఈ పాత్ర కోసం చిరంజీవి రెకమెండ్ చేసినట్లు సమాచారం. అచార్య లో ఈ పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందని ప్రాముఖ్యత కూడా అదే రేంజ్ లో ఉంటుందని టాక్ నడుస్తుంది. అయితే కిచ్చ సుదీప్ తో ముందుకి వెళ్లాలా వద్దా అనే ఆలోచన డిస్కషన్ స్టేజీలో ఉందని సమాచారం. మరి చిరు కోరిక మీద కొరటాల సుదీప్ ను దాదాపు ఫిక్స్ చేస్తారు అని అంటున్నారు.
కిచ్చ సుదీప్ గనుక ఈ సినిమా లోకి వస్తే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతాయి. అంతేకాకుండా కన్నడలో కూడా ఆచార్య వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. మెగా ఫ్యాన్స్ కూడా కిచ్చ సుదీప్ పోషించిన పాత్రకు మంత్రముగ్ధులు అయిపోయారు. అతను కనుక ‘ఆచార్య’ లో ఉంటే చిరంజీవి-సుదీప్ సీన్స్ వచ్చినప్పుడు థియేటర్లో పేట్రేగిపోతారు. మరి కొరటాల ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సుదీప్ ను త్వరలోనే ఓకే చేస్తే బాగుండు అని అందరూ అనుకుంటున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!