Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్‘ సినిమా ట్రైలర్ బుధవారం నాడు రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ రిలీజ్ కావడమే ఆలస్యం.. మెగా ఫ్యామిలీ అంటే పడని కొంతమంది గాడ్ ఫాదర్ సినిమా, చిరంజీవిపై బురదజల్లే ప్రయత్నాలు చేయడం మొదలెట్టారు. ఇప్పుడు వీరు కొన్ని సీన్స్‌ని పోస్టుల రూపంలో సోషల్ మీడియాలో పెట్టి కించపరిచేలా మాట్లాడుతున్నారు. సాధారణంగా ఈ యాంటీ ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీ నుంచి ఏ హీరో సినిమా వచ్చినా కూడా ట్రోల్స్ చేస్తారు. ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమాపై ఎలా ట్రోల్ చేస్తున్నారో చూద్దాం.
Chiranjeevi: ఆ సీన్‌తో ట్రోల్

మలయాళ నటుడు మోహన్ లాల్‌తో పోలిస్తే చిరంజీవి అన్ని విషయాల్లో తేలిపోయారనేది ట్రోలర్స్ అంటున్న మాట. దీనికోసం గాడ్ ఫాదర్ సినిమా లోని ఒక సన్నివేశాన్ని ట్రోల్ చేస్తు ఉదాహరణగా చూపిస్తున్నారు. ఈ సన్నివేశంలో చిరు ఒక పోలీస్ ఆఫీసర్ ని గోడకు ఆనించి అతని గుండెలపై కాలుతో తన్నాడు. ఒరిజినల్ మూవీలో ఇలాంటి ఒక సన్నివేశంలో మోహన్ లాల్ తన కాలును పైకెత్తి నిల్చున పోలీస్ ఆఫీసర్ గుండెలపై తంతున్నాడు. దీనికీ భినంగా గాడ్ ఫాదర్ లో చిరంజీవి కుర్చున పోలీస్‌ని కాలితో కిక్ ఇచ్చాడు. ఈ రెండు ఫొటోలను పక్కపక్కన పెట్టి చూస్తే మోహన్ లాల్ స్ట్రైకింగ్ గా ఉండటం వాస్తవం.
ముసలోడు అయిపోయాడు

ఒక తమిళ క్రిటిక్ ఈ పోస్ట్ పెట్టి చిరుని అవమానించే ప్రయత్నం చేసాడు. మోహన్ లాల్ ఇప్పటికీ యంగ్ అండ్ ఎనర్జిటిక్ అని చిరు మాత్రం ముసలోడు అయిపోయాడు అంటూ అతడు పరోక్షంగా కించపరిచేలా పోస్ట్ పెట్టాడు. నిజానికి వయసు విషయంలో చిరు మోహన్ లాల్ కంటే ఐదేళ్లు పెద్దవాడు. అంతేకాకుండా చిరుతో పోల్చుకుంటే మోహన్ లాల్ కాస్త ఫీట్ గానే ఉంటాడు. ఈ ఒక్క విషయం గురించి చిరుతో పోల్చి మోహన్ లాల్ గొప్పవాడిగా చూపిస్తున్నావు వాళ్ళు చాలామంది ఉన్నారు.
కౌంటర్ ఇస్తున్న మెగా ఫ్యాన్స్

అయితే అలాంటివారు అందరూ చిరు డ్యాన్స్ గురించి ఒకసారి ఆలోచిస్తే బాగుంటుందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. చిరు వేసే స్టెప్పులకు మోహన్ లాల్ స్టెప్పులకు అసలు పొంతనే ఉండదు. అంతేకాకుండా కామెడీ టైమింగ్, ఫైటింగ్స్ లో చిరునే ముందుంటాడు. అలా అని మోహన్ లాల్ గురించి తక్కువ చేసి మాట్లాడే ఉద్దేశం ఇక్కడ లేదు. ఎవరి గొప్పతనం వారికే ఉంది. ఎవరి ప్రత్యేకతలు వారికే ఉన్నాయి. కాబట్టి ఒకరితో ఇంకొకరిని పోల్చి తక్కువ చేసి ఏ ట్రోల్స్ చేయడం అనేది మార్చోవడం మంచిది.