VIDEO NEWS: నిన్న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అని అందరికీ తెలుసు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో మెగా అభిమానులు భారీగా హడావిడి చేశారు. అంతేకాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖ హీరోలు రాజకీయ పార్టీల నాయకులు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే చిరంజీవి పుట్టినరోజు నాడు.. రాఖీ పండుగ నేపథ్యంలో చిరంజీవి ఇంటిలో చెల్లెళ్ల తో పాటు.. సోదరులు పవన్ కళ్యాణ్, నాగబాబు సందడి చేశారు. పుట్టిన రోజు రాఖీ పండుగ ఒకేరోజు రావడంతో చిరంజీవి ఇంట్లో.. కుటుంబమంతా కలవడం జరిగింది. ఈ సందర్భంగా సోదరీమణులు చిరంజీవి కి రాఖీ కట్టి.. అన్నయ్య చిరంజీవి ఆశీస్సులు అందుకోవడం జరిగింది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కి, నాగబాబు కూడా రాఖీ కట్టారు.
ఈ సందర్భంలో కార్యక్రమంలో చిరంజీవి బాగా అలసిపోయి పక్కన కూర్చుని ఒక్కసారిగా దాహం అని చిన్న సైగా కేసిన క్రమంలో.. పవన్ కళ్యాణ్ పరిగెత్తుకుని వేరే గదిలోకి వెళ్లి.. బాటిల్ తో… గ్లాస్ లో వాటర్ అందించడం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో రావటంతో చాలా పెద్ద సార్ అది కూడా రాజకీయంగా.. ఎదుగుతున్న పవన్ కళ్యాణ్.. అన్నయ్య పట్ల చూపిన గౌరవానికి మెగా అభిమానులతో పాటు.. సామాన్య నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఎంత ఎదిగినా కానీ పవన్ కళ్యాణ్ కి అన్నయ్య అంటే ప్రత్యేకమైన అభిమానం అంటూ పవన్ కళ్యాణ్ చిరంజీవి దాహానికి రియాక్ట్ అయిన సన్నివేశాన్ని చూసి మెగా అభిమానులు.. సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. రాఖీ పండుగ చిరంజీవి పుట్టినరోజు ఒకే రోజు కావడంతో.. చిరంజీవి ఇంటి లో నెలకొన్న సందడి వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. కన్నుల పండుగగా రాఖీ పండుగ చిరంజీవి బర్త్ డే వేడుకలు జరిగాయి.
VIDEO NEWS: వీడియో లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచినా పవన్…:-
దాదాపు కొన్ని సంవత్సరాల పాటు టాలీవుడ్ బాక్సాఫీస్ నీ చిరంజీవి శాసించటం తో .. పాటు తెలుగు రాష్ట్రాలలో తన కుటుంబానికి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకు రావటం మాత్రమే కాక తన ఫ్యామిలీలో అనేక మందికి లైఫ్ ఇవ్వటం జరిగింది. తన జీవితం ద్వారా కష్టపడితే ఎటువంటి విజయమైనా సాధించవచ్చు.. కష్టేఫలి అన్న రీతిలో తెలపడం జరిగింది. ఇండస్ట్రీలో స్వయంకృషితో భారతీయ చలన చిత్ర రంగం చరిత్రలో తనకంటూ సపరేట్ పేజీలో క్రియేట్ చేసిన చిరంజీవి.. పద్మభూషణ్ అవార్డు కూడా అందుకున్నారు. ఏ రీతిగా ఎన్నో శిఖరాలను అందుకున్న చిరంజీవి.. నిన్న 66 వ యేట పుట్టిన రోజు తో పాటు తన సోదరీమణులకు రాఖీ వేడుకలు చేసుకుని.. బాగా ఎంజాయ్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఎప్పుడూ ఫంక్షన్ లకు దూరంగా ఉండే పవన్ కళ్యాణ్ చిరంజీవి 66 వ ఏట వేడుకలలో భాగంగా సందడి చేయడం తో.. వీడియో లో పవన్ కళ్యాణ్ ని చూసి మెగా అభిమానులతో పాటు.. కొణిదల కుటుంబం కూడా హ్యాపీగా ఫీల్ అయింది. ఈ కార్యక్రమంలో ఇండస్ట్రీ ప్రముఖులు నిర్మాతలు..డైరెక్టర్ లు పాల్గొన్నడం జరిగింది.