Chiranjeevi: మరో రెండు నెలల్లో మా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అధ్యక్ష పదవి కోసం ఈ సారి ఏకంగా ఐదుగురు పోటీ చేస్తూ ఉన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఐదుగురు పోటీ చేయడంతో ఈ సారి మా ఎన్నికలు కీలకం గా మారాయి. గతంలో అధ్యక్ష పదవి కోసం కేవలం ఇద్దరు మాత్రమే పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి.
పరిస్థితి ఇలా ఉంటే అధ్యక్ష ఎన్నికలలో గెలవడం కోసం పోటీదారులు మరియు వారి మద్దతుదారులు చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, నటి హేమ మరో సీనియర్ నటుడు మా అధ్యక్ష పదవి కోసం పోటీపడతాకి బరిలోకి దిగి మద్దతు కూడగట్టడానికి రెడీ అవుతున్నారు.
Read more: Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని క్రాస్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..!!
ఇదిలా ఉంటే మా అసోసియేషన్ ఎన్నికలలో ఇస్తున్న హామీల లో ఎప్పటినుండో.. “మా” అసోసియేషన్ కి ప్రత్యేకమైన భవనం.. అనేది కీలకం. గడిచిన సమయం లో ఈ భవనం విషయంలో అనేక మంది హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత చేతులెత్తేసిన పరిస్థితులు. ఇటువంటి తరుణంలో “మా” అసోసియేషన్ భవనం విషయంలో డేరింగ్ అండ్ డాషింగ్ నిర్ణయం తీసుకునే రీతిలో చిరంజీవి రెడీ అయినట్లు ఫిలిం వర్గాలు అంటున్నాయి. విషయంలోకి వెళ్తే.. మహా శేషం ప్రత్యేక భవనం కోసం చిరంజీవి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చలు జరపాలని డిసైడ్ అవ్వడం జరిగిందట. ఇందుకోసం ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరిని తీసుకెళ్ళడానికి రెడీ అవుతున్నట్లు టాక్. స్థలం విషయంలో తెలంగాణ ప్రభుత్వం సరిగా స్పందించకుంటే ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో సమావేశం నిర్వహించి.. మా అసోసియేషన్ కి ప్రత్యేకమైన భవనం పేట్టించే ప్రయత్నాలు చిరంజీవి చేయాలని శాశ్వత పరిష్కారం చూపాలని అనుకుంటున్నట్లు ఫిలిం నగర్ టాక్.