21.7 C
Hyderabad
December 2, 2022
NewOrbit
న్యూస్ సినిమా

Chiranjeevi: కృష్ణ అంతటి త్యాగం చేయకపోతే చిరంజీవి మెగాస్టార్ అయ్యేవాడు కాదు!

Share

Chiranjeevi: ఒక్క సంఘటన చాలు జీవితాన్ని మలుపు తిప్పడానికి అని అంటారు పెద్దలు. అయితే టాలీవుడ్ సీనియర్ హీరో, మెగాస్టార్ చిరంజీవి జీవితం కూడా 1987లో జరిగిన ఒకే ఒక్క సంఘటనతో మారిపోయింది. అది కూడా సూపర్ స్టార్ కృష్ణ చేసిన త్యాగం వల్ల అంటే మీరు నమ్ముతారా? చిరంజీవి ఖైదీ సినిమాతో స్టార్డమ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అతడికి మళ్ళీ ఎక్కువగా పేరు తెచ్చిపెట్టింది ‘పసివాడి ప్రాణం (1987)’ అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ సినిమా చాలా తక్కువ బడ్జెట్‌తో తీయగా రూ.5 కోట్లు సంపాదించి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది.

Chiranjeevi: పసివాడి ప్రాణం చేయాలనుకున్న కృష్ణ

Chiranjeevi 

నిజానికి ఈ మూవీని కృష్ణ చేయాలనుకున్నారు కానీ చిరంజీవి చేస్తున్నారని తెలిసి తాను సైడ్ అయిపోయారు. దాంతో ఇలాంటి మంచి కథ తెలుగులో తానొక్కడే మూవీ చేయగల సువర్ణావకాశం లభించినట్లయింది. ఈ మూవీనే కన్నడ, మలయాళం భాషల్లో మొదటిగా తీశారు. అంతకంటే ముందు దీనిని హాలీవుడ్‌లో విట్నెస్‌గా రూపొందించారు. ఈ సినిమా 1985లో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కాగా దీనిని వెంటనే మన భారతీయులు రీమేక్ చేశారు. తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ చేయదలుచుకున్నారు కానీ చిరంజీవి ఈ మూవీ చేస్తున్నారని తెలిసి వెంటనే తన ప్రయత్నాన్ని మానుకున్నారు.

కృష్ణ త్యాగంతో మారిపోయిన చిరు తలరాత

Chiranjeevi
Chiranjeevi

నిజానికి కృష్ణ తన సినిమాలు చాలా త్వరగా చేస్తారు. ఆయన తలుచుకుంటే పసివాడి ప్రాణం మూవీnని చిరంజీవి కంటే ముందే తెరకెక్కించగలిగేవారు. అలా చేసినట్లయితే చిరంజీవి సినిమాకి అంతగా రెస్పాన్స్ వచ్చి ఉండేది కాదు. దీని వల్ల చిరు ఒక యావరేజ్ హిట్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చేది. కానీ చిరంజీవి కోసమే కృష్ణ త్యాగం చేసి ఒక సూపర్ హిట్ సినిమాని ప్రసాదించారు. దాంతో చిరు కెరీర్ మారిపోయింది. ఈ చిత్రంలో చిరు ఒక పెయింటర్‌గా, తాగుబోతుగా అద్భుతంగా యాక్ట్ చేస్తాడు. తన జీవితంలోకి ఒక మూగ, చెవిటి బాలుడు వచ్చాక పూర్తిగా మారిపోతాడు. ఈ వేరియేషన్ చూపించడంలో చిరంజీవి బాగా సక్సెస్ అయ్యాడు. ఇక ఇది ఒక థ్రిల్లర్ మూవీగా తెరకెక్కింది. ఇందులో ఒక చిన్న పిల్లాడి తల్లిదండ్రుల్ని వేరే వాళ్ళు హత్య చేస్తారు. ఆ విషయం తర్వాత తెలుస్తుంది. అదే ఈ మూవీలోని థ్రిల్లింగ్ పాయింట్.


Share

Related posts

Face Pack: రాత్రి పూట ఇది రాసుకుని పొద్దున అద్దంలో మీ మొహం చూసుకుంటే మీరే ఆశ్చర్యపోతారు..!!

bharani jella

Voter ID: సింపుల్ గా ఓటర్ కార్డు లో అడ్రస్ మార్చుకోండిలా..!!

bharani jella

ఎన్టీఆర్ వర్ధంతి నాడు చిన్న ఎన్టీఆర్ అంటూ లక్ష్మీపార్వతి బ్రేకింగ్ కామెంట్స్..!!

sekhar