Chiranjeevi tollywood: మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్దన్నలా మొన్నటిదాకా వ్యవహరించారు. కరోనా కాలంలోనూ ఆయన టాలీవుడ్ పరిశ్రమకు తలకాయలా వ్యవహరించారు. అన్ని తానై నడిపించారు కానీ ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల మధ్య ఆయన ఇండస్ట్రీతో అంటిముట్టనట్లుగానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగు సినీ పరిశ్రమకు పెద్దగా ఉండాలని సినీ కార్మికులు కోరగా ఆయన నుంచి షాకింగ్ సమాధానం వినిపించింది.
తాజాగా మెగాస్టార్ మాట్లాడుతూ “పెద్దగా ఉండను.. ఉండలేను.. కావాల్సినప్పుడు అండగా నిలబడతా.. అవసరమైనప్పుడు ఆదుకుంటా..” అని కుండబద్దలు కొట్టారు. దీంతో అతని మనసులో మాట ఏంటో అందరికీ అవగతమైంది. పెద్దరికం తనకు అవసరం లేదని.. పంచాయతీ చేయాలన్న కోరిక కూడా లేదని చిరంజీవి వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశమయింది. ఇద్దరు కొట్టుకుంటుంటే అలాంటి పంచాయతీలకు తాను దూరంగా ఉంటానని చిరు చెప్పుకొచ్చారు. అయితే సినిమా కార్మికులకు అండగా ఉంటానని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. దాసరి నారాయణరావు కన్నుమూసిన అనంతరం టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లేకుండాపోయారు. అయితే అతని స్థానాన్ని భర్తీ చేస్తూ ఆ బాధ్యతలు తీసుకుంటారా అని సినీ కార్మికులు అడిగితే నో అని స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఇచ్చారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!