NewsOrbit
న్యూస్ సినిమా

Yandamuri Veerendranath: చిరంజీవి ‘దొంగమొగుడు’ మళ్లీ..! ‘నల్లంచు తెల్లచీర’గా సరికొత్తగా..

chiranjeevi dongamogudu remake

Yandamuri Veerendranath: యండమూరి వీరేంద్రనాధ్ Yandamuri Veerendranath: నవలా రంగంలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించారు. 80వ దశకంలో ఆయన నవలలు వార పత్రికల్లో హైలైట్. ఆయన సీరియల్స్ కోసమే వారపత్రికలు హాట్ కేకుల్లా అమ్ముడయ్యేవి. అప్పట్లో సినిమా తప్పితే వేరే ఎంటర్ టైన్ మెంట్ మాధ్యమం లేదు. దీంతో ఇళ్లలో ఉండే మహిళలకు వారపత్రికలు, నవలలే ప్రత్యామ్నాయం. ఇప్పుడు నెట్టింట్లో వస్తున్న సినిమా వార్తలు, గాసిప్స్, ఫొటోషూట్స్, తారల ఇంటర్వ్యూలన్నీ.. ఈ వారపత్రికల్లోనే. దీంతో రచయితలకు మంచి ప్రాముఖ్యం ఉండేది. అలా.. యండమూరి రచనలకు విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ఆయన సీరియల్స్, నవలలెన్నో సినిమాలుగా తెరకెక్కి సూపర్ హిట్లయ్యాయి. అటువంటి నవలే నల్లంచు తెల్లచీర ఒకటి.

chiranjeevi dongamogudu remake
chiranjeevi dongamogudu remake

ఈ నవలను మెగాస్టార్ చిరంజీవితో దొంగమొగుడుగా తెరకెక్కించారు. ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. చిరంజీవిలోని మాస్ కోణాన్ని మరింత కొత్తగా చూపారు. స్టూవర్టుపురం పోలిస్ స్టేషన్, దుప్పట్లో మిన్నాగు నవలలను ఆయన స్వీయ దర్శకత్వంలో సినిమాలుగా తెరకెక్కించారు. అవి రెండూ అప్పట్లో ఫ్లాపయ్యాయి. మూడు దశాబ్దాల తర్వాత ఆయన మళ్లీ మెగాఫోన్ పట్టబోతున్నారు. ‘నల్లంచు తెల్లచీర’ అనే సినిమాకు ఆయన దర్శకత్వం వహించబోతున్నారు. ఆయన రాసిన నవలనే సరికొత్త కథనంతో తెరెకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం బాధ్యతలు యండమూరి నిర్వహిస్తున్నారు.

Read More: Movie Release: ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ చేసిన హీరోలు..!!

ఈ సినిమాను ఓటీటీ కోసం రూపొందిస్తున్నారు. ఊర్వశి ఓటీటీ సమర్పణలో భీమవరం టాకీస్ – సంధ్య స్టూడియోస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. నిర్మాతలు తుమ్మలపల్లి రామ సత్యనారాయణ – రవి కనగాల సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమాకు తాళ్లూరి నాగరాజు సంగీతం అందిస్తున్నారు. అమీర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సినిమాపరంగా ఇది మాస్, ఫ్యామిలీ కంటెంట్. చిరంజీవి మాస్, మాధవి, రాధిక నటన, కథ సినిమాకు బలం. చక్రవర్తి సంగీతంలోని పాటలన్నీ సూపర్ హిట్టే. ఇప్పుడు తెరకెక్కిస్తున్న ‘నల్లంచు తెల్లచీర’ దొంగమొగుడుకు రీమక్ మూవీనా.. కొత్త తరహా జోనర్ లో తెరకెక్కుతుందా అనేది చూడాల్సి ఉంది.

 

author avatar
Muraliak

Related posts

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Krishna Mukunda Murari April 23 2024 Episode 450: ఆదర్శ్ కి అడ్డంగా దొరికిపోయిన ముకుంద. క్రిష్ణ మురారి బాధ. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Trinayani April 23 2024 Episode 1220: అమ్మవారి పూజ చేసిన నైని గాయత్రీ దేవి జాడ తెలుసుకుంటుందా లేదా..

siddhu

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

Jagadhatri April 23 2024 Episode 212: అఖిలాండేశ్వరి కాళ్లు పట్టుకున్న కేదార్, నువ్వు  ఓడిపోవు కౌశికి అంటున్న అఖిలాండేశ్వరి..

siddhu

Brahmamudi April 23 2024 Episode 391: రాజ్ కొడుకు పై మీడియా ఆరా.. రాజ్ కి అర్హత లేదన్న అనామిక.. మీడియా ముందు ఇంటిగుట్టు..?

bharani jella

Naga Panchami: పంచమి కోసం వెతుకుతున్నా మోక్షకు పంచమి దొరుకుతుందా లేదా

siddhu

Nuvvu Nenu Prema April 23 2024 Episode 605: తల్లికి నిజం చెప్పని పద్మావతి..అరవింద ని కిడ్నాప్ చేసి విక్కీని బెదిరించిన కృష్ణ..

bharani jella

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

Aa Okkati Adakku: అల్లరి నరేష్ “ఆ ఒక్కటి అడక్కు” ట్రైలర్ రిలీజ్..!!

sekhar