PV Sindhu: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ని సత్కరించిన చిరంజీవి సినీ ప్రముఖులు..!!

Share

PV Sindhu: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ని మెగాస్టార్ చిరంజీవి తన నివాసంలో సత్కరించారు. ఇటీవల టోక్యో నగరంలో జరిగిన ఒలింపిక్స్ లో కాంస్య పతకం పీవీ సింధు సాధించటం తెలిసింది. వరుసగా రెండు ఒలంపిక్స్ లో.. పీవీ సింధు సత్తా చాటడంతో పాటు దేశం గర్వించే రీతిగా రాణించడంతో.. మెడల్ సాధించిన తర్వాత ఢిల్లీలో ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పీవీ సింధు ని సత్కరించడం జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి తో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖులు.. పీవీ సింధు ని సత్కరించారు. ఈ సన్మాన కార్యక్రమంలో చిరంజీవి, రాధిక, సుహాసిని, నాగార్జున, చిరంజీవి భార్య సురేఖ తో పాటు అల్లుఅరవింద్.. దగ్గుబాటి రానా, రామ్ చరణ్, అక్కినేని అఖిల్, మరి కొంతమంది కుర్ర హీరోలతో పాటు ప్రముఖులు హాజరయ్యారు.

Watch: Chiru Hosted A Party For PV Sindhu -

ఈ సందర్భంగా చిరంజీవి ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. దేశం గర్వించేలా వరుసగా రెండుసార్లు ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన పీవీ సింధు నీ ఆత్మీయుల మధ్య సత్కరించడం ఎంతో సంతోషాన్నిచ్చింది అని పోస్ట్ పెట్టి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ క్రమంలో పీవీ సింధు సాధించిన కాంస్య పథకం తో ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు ఫోటోలు దిగారు.

Stars at Chiranjeevi's special bash for PV Sindhu

ఇదే సందర్భంలో లో పీవీ సింధు ని చిరంజీవి దంపతులు సత్కరించడం జరిగింది. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. పీవీ సింధు సాధించిన విజయాలను కొనియాడారు. సింధు ని చూసి దేశం మొత్తం గర్వ పడటం జరిగిందని.. సింధు ని చూస్తే తన బిడ్డే అనే భావన కలిగింది అని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం పీవీ సింధు మాట్లాడుతూ తన పై చిరంజీవి కుటుంబం చూపించిన ప్రేమ గౌరవం ఎప్పటికీ… గుర్తు ఉంటుందని.. వచ్చే ఒలంపిక్స్ లో కచ్చితంగా బంగారు పతకం సాధిస్తానని సింధు తెలిపారు.


Share

Related posts

సుశాంత్ – రియా డ్రగ్ కేసు : రకుల్ ప్రీత్ సింగ్ నిజం ఒప్పుకోకపోతే ఏం జరుగుతుంది ??

arun kanna

Pan Aadhaar link: పాన్ కార్డు దారులకు కేంద్రం నూతన వెసులుబాటు ఇదీ..

somaraju sharma

Tooth Powder: ఈ పళ్ళపొడితో పళ్ళు తోముకుంటే పళ్ళు మిలమిల మెరిసిపోతాయి..!!

bharani jella