ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి వచ్చి తనదయిన శైలిలో తన నటనతో ప్రేక్షకులను ఆకటున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే 150 పైగా చిత్రాల లో నటించి ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమా తో బిజీ బిజీ గా ఉన్నారు మెగాస్టార్. ఆయన సినీ ప్రయాణం గురించి మన అందరికి తెలిసిందే.
ఇలాంటి గొప్ప పేరు ప్రఖ్యాతులను సంపాదించుకుని గణ విజేతగా నిలిచిన మెగాస్టార్ తన సినీ జీవితంలో కేవలం ఒకే ఒక సినిమాలో హీరోగా ఛాన్స్ రాలేదని కన్నీరు పెట్టుకున్నారంటే మీరు నమ్ముతారా? అవును.. నిజంగానే ఆయన కన్నీరు పెట్టుకుని ఏకంగా మూడు రోజుల పాటు చాలా దిగ్భ్రాంతికి గురయ్యారట. అయితే మెగా స్టార్ అంతటి దిగ్బ్రాంతికి గురిఅయ్యి ఏ సినిమా కోసం కన్నీరు పెట్టుకున్నారో తెలుసా?
1986లో విదుదల అయిన ‘స్వాతిముత్యం’ థియేటర్ ల వద్ద బ్రహ్మాండమైన ప్రేక్షకాదరణ పొందింది. అప్పుడు థియేటర్ లలో ఉన్న కమర్షియల్ సినిమాకు దీటుగా వంద రోజులకు పైగా చాలా కేంద్రాల్లో ఈ చిత్రం ఆడింది. అయితే, అప్పటిలో ఈ సినిమా చుసిన వారిలో కమలహాసన్ గురించి మాట్లాడుకోని ప్రేక్షకులంటూ ఎవరూ లేరని చెప్పొచ్చు. ఇంత ప్రేక్షక ఆదరణ పొందడంతో చిరంజీవి కూడా ఈ సినిమాను చూశారట. అంతే ఇక ఆ సినిమా చూసినప్పటి నుంచి మూడ్ ఆఫ్ అయ్యారట.
“ప్రేక్షకుల మన్నన పొందుతూ సుప్రీం హీరో మరియు మెగాస్టార్ అని పిలిపించుకున్న నాకేం తక్కువ ఇండస్ట్రీ లో అని అనుకుంటున్న రోజుల్లో ఒక్కసారిగా స్వాతిముత్యం సినిమాను చూసిన తరువాత నేను ఏం కోల్పోయానో నాకు అర్థం అయ్యింది. అంతటి సుప్రీమ్ హీరోగా పేరు తెచ్చుకున్న నాకు ఎందుకు ఇలాంటి పాత్ర రాలేదు? అని అప్పటిలో ఎన్నోసార్లు నాలో నేనే మదన పడ్డాను” అంటూ సోషల్ మీడియా లో చిరంజీవి చెప్పుకొచ్చారు.