NewsOrbit
న్యూస్ సినిమా

Chiranjeevi: బాక్సాఫీస్ ను రఫ్ఫాడేసిన చిరంజీవి.. ‘గ్యాంగ్ లీడర్’ కు 30 ఏళ్లు..

chiranjeevi gang leader completes 30 years

Chiranjeevi:  మెగాస్టార్ చిరంజీవి Chiranjeevi కెరీర్లో సాధించిన ఇండస్ట్రీ హిట్లు తెలుగులో మరే హీరో సాధించలేదు. 9 ఇండస్ట్రీ హిట్స్ తో (ఒక నాన్ బాహుబలి) తిరుగులేని రికార్డు మెగాస్టార్ సొంతం. ఓదశలో 1987 నుంచి 1992 వరకూ వరుసగా ప్రతి ఏడాదీ ఓ ఇండస్ట్రీ హిట్ ఇచ్చి తెలుగు సినిమాపై తిరుగులేని ఆధిపత్యం సాధించారు. ఈ వరుసలో వచ్చిన ఓ ఇండస్ట్రీ హిట్ ‘గ్యాంగ్ లీడర్’. అప్పటికే నెంబర్ వన్ హీరోగా, మెగాస్టార్ గా ఉన్నా.. ఈ సినిమా సాధించిన సంచలన విజయం చిరంజీవిని తిరుగులేని స్థానంలో నిలబెట్టింది. 1991 మే 9న విడుదలైన ఈ సినిమా నేటితో 30 ఏళ్లు పూర్తి చేసుకుంది.

chiranjeevi gang leader completes 30 years
chiranjeevi gang leader completes 30 years

చిరంజీవి ప్రభ అప్రతిహతంగా వెలిగిపోతున్న దశలో  వచ్చిందీ సినిమా. మాస్, ఫ్యామిలీ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. సినిమాలో చిరంజీవి బాడీ లాంగ్వేజ్, మాస్ మేనరిజమ్స్, స్టయిల్, డైలాగ్ డిక్షన్.. అభిమానులకు కిక్కెక్కించాయి. నలుగురు స్నేహితులకు లీడర్ గా, పెద్ద కుటుంబానికి దిక్కుగా.. చిరంజీవితో నట విశ్వరూపం చూపించారు దర్శకుడు విజయబాపినీడు. మొదట బాపినీడు ఈ కథను చిరంజీవికి చెప్తే పెద్దగా నచ్చలేక పక్కన పెట్టారట. అయితే.. పరుచూరి బ్రదర్స్ స్వయంగా ఈ విషయం తెలుసుకుని బాపినీడు గారితో మూడు రోజులు టైమ్ అడిగి మార్పులు చేసి మళ్లీ చిరంజీవికి వినిపిస్తే.. అద్భుతం.. సినిమా చేద్దామన్నారట. తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లలో ఓ ప్రభంజనమే సృష్టించింది.

బప్పీలహరి అందించిన సంగీతంలోని పాటలన్నీ బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. ఈ పాటలకు సినిమాలో చిరంజీవి చేసిన డ్యాన్సులకు ధియేటర్లలు దద్దరిల్లిపోయాయి. చిరంజీవి-విజయశాంతి కాంబినేషన్ ఆకట్టుకుంది. మాగంటి రవీంద్రనాధ్ చౌదరి నిర్మాతగా శ్యాంప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మించారు. అంతకుముందు ఏడాది జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాతో చిరంజీవే సృష్టించిన ఇండస్ట్రీ రికార్డును గ్యాంగ్ లీడర్ తో చెరిపేసి సరికొత్త ఇండస్ట్రీ రికార్డు నెలకొల్పారు. ‘చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉందో.. రఫ్ఫాడించేస్తాను’ అనే డైలాగ్ పేలిపోయింది. ఇప్పటికీ ఆ డైలాగ్ పాపులరే. ఈ సినిమా శతదినోత్సవ వేడుకలను ఒకేరోజు హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, ఏలూరు నగరాల్లో హెలికాఫ్టర్లలో వెళ్లి నిర్వహించడం విశేషం.

 

author avatar
Muraliak

Related posts

ఒక్క భీమిలి సీటు కోసం ఇంత మంది పోటీయా… గంటాకు నో ఛాన్స్‌..?

గంటాను గురి చూసి కొట్టేసిన చంద్ర‌బాబు… తొక్కేసేంది ఎవ‌రంటే…!

చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన అభ్య‌ర్థులు మ‌ళ్లీ మార్పులు.. షాక్‌లు ఎవ‌రికంటే..!

కొడాలి కూసాలు కుదిపేస్తున్న ‘ వెనిగండ్ల ‘ .. గుడివాడ‌లో స‌రికొత్త మార్పు.. !

ఏం చేశార‌ని ‘ గ‌ద్దె ‘ కు ఓటేయాలి… సొంత సామాజిక వ‌ర్గంలోనే ఎదురీత‌..!

ఎన్టీఆర్ టు లోకేష్‌కు న‌మ్మిన బంటు.. వ‌యా చంద్ర‌బాబు… టీడీపీకి మ‌న‌సు పెట్టిన మారాజు ‘ య‌ర‌ప‌తినేని ‘

Madhuranagarilo March 19 2024 Episode 316:  ఓడిపోయే నీతులు మాట్లాడుతున్నావా అంటున్న రుక్మిణి,నేనే గెలిచాను అంటున్నా రాధా..

siddhu

MLC Kavitha: సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ ను ఉపసంహరించుకున్న కవిత

sharma somaraju

Highest Paid Indian Actors: ఇండియాలో అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న హీరో ఎవ‌రు.. ప్ర‌భాస్ ఏ స్థానంలో ఉన్నాడో తెలుసా?

kavya N

Youtuber Deepti Sunaina: ఆ పార్ట్ చూపిస్తూ కుర్రాళ్లను ఉర్రూతలూగిస్తున్న దీప్తి సునైనా.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Pushpa 2: “పుష్ప 2″లో నెగిటివ్ రోల్ లో “యానిమల్” హాట్ బ్యూటీ..?

sekhar

Tamilisai: తమిళి సై రాజీనామాకు ఆమోదం .. ఝూర్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్ కు అదనపు బాధ్యతలు

sharma somaraju

Breaking: భారీ ఎన్‌కౌంటర్ .. నలుగురు మావో అగ్రనేతల హతం

sharma somaraju

Paluke Bangaramayenaa March 19 2024 Episode 180: స్వర అభికి ప్రేమ గురించి చెబుతుందా,  భగవంతుడే కలుపుతాడు అంటున్న యశోద..

siddhu

Jagadhatri March 19 2024 Episode 182:  జగదాత్రిని అరెస్టు చెయ్యమంటున్న నిషిక, నాకు గంట టైం ఇవ్వండి అంటున్న జగదాత్రి..

siddhu