KCR : ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ పుట్టిన రోజు సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో పుట్టినరోజు వేడుకలు జరుపుతున్నారు. ఈ క్రమంలో పలు నియోజకవర్గాలలో టిఆర్ఎస్ పార్టీ నేతలు అనేక సహాయ కార్యక్రమాలు చేయడం కోసం భారీగా ఏర్పాటు చేయడం జరిగింది.
ఇలా ఉంటే కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. విషయంలోకి వెళితే రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన ‘కోటి వృక్షార్చన’ అనే పిలుపు మేరకు చిరంజీవి స్పందించడం జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి తన ట్విట్టర్లో వీడియోను పోస్ట్ చేసి కెసిఆర్ పుట్టినరోజు గిఫ్ట్ అండ్ క్యాప్షన్ పెట్టారు. ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి వృక్షాలు నాటడానికి సీఎం కేసీఆర్ పుట్టిన రోజు ను వేదికగా చేసుకోవడంతో ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేయటం జరిగింది. మొన్న నాగార్జున తాజాగా చిరంజీవి కార్యక్రమాన్ని సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోటి మొక్కలు నాటాలని కోరుతూ వీడియోను విడుదల చేశారు. అంతమాత్రమే కాకుండా కెసిఆర్ పుట్టిన రోజు కానుకగా అందిద్దాం అని తెలుపుతూ.. మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో రిలీజ్ చేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఈ సంస్థ ఆధ్వర్యంలో ఒక్క గంటలో కోటి మొక్కలు అనే ఈ కోటి వృక్షార్చన ఈ కార్యక్రమాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ప్రముఖులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని జరుపుతున్నారు.