ట్రెండింగ్ న్యూస్ సినిమా

చిరంజీవి లూసీఫర్ తెలుగు రీమేక్ ప్రారంభం ..!

Share

చిరంజీవి లూసీఫర్ తెలుగు రీమేక్ లో నటించబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. వి.వి.వినాయక్, సుజీత్ ల తర్వాత ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చిన మోహన్ రాజా స్క్రిప్ట్ లో చెప్పిన మార్పులు మెగాస్టార్ కి విపరీతంగా నచ్చడం తో లూసీఫర్ తెలుగు రీమేక్ ని తెరకెక్కించే బాధ్యతలు అప్పగించారు. ఈ విషయాన్ని ఇంతక ముందే మెగాస్టార్ వెల్లడించారు. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందో అన్న క్లారిటి లేక ఇన్నాళ్ళు మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఎట్టకేలకి వాళ్ళ ఎదురు చూపులు ఫలించాయి. ఫిబ్రవరి నుంచి చిరంజీవి 153 సెట్స్ మీదకి వెళ్ళబోతుండగా ఈరోజు ఫిలిం నగర్ లోని సూపర్ గుడ్ సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ – సూపర్ గుడ్ ఫిలిమ్స్ – ఎన్వీఆర్ సినిమా బ్యానర్స్ పై ఆర్.బి చౌదరి – ఎన్.వి.ప్రసాద్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకి ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి ఫాంలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ సంగీతమందిస్తున్నాడు.

త్వరలో ఈ సినిమాలో నటించే నటీ నటులను ప్రకటించనున్నారు. అయితే ప్రియమణి హీరోయిన్ గా నటించే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు. రాం చరణ్ సిద్ద అన్న కీలక పాత్రలో పాత్రలో నటిస్తుండగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీస్ బ్యానర్స్ పై రాం చరణ్ – నిరంజ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఆచార్య సమ్మర్ లో రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు.


Share

Related posts

Dethadi Harika: అర‌రే పాపం.. దేత్త‌డి హారిక ఇలా అడ్డంగా దొరికిపోయిందేంటి..?

kavya N

మ‌న ప్యానెల్ విజ‌యం

Siva Prasad

UNSTOPPABLE 2 : ‘ఆ అమౌంట్ ఇస్తేనే UNSTOPPABLE 2 లేదంటే లేదు’ అల్లూ అరవింద్, ఆహాకి బాలయ్య మార్క్ ఝలక్?

Ram
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar