Chiranjeevi:6 పదుల వయస్సులోనూ మెగాస్టార్ తన సత్తా చూపుతున్నాడు. వరుస సినిమాలను ప్రకటిస్తూ ముందుకు దూసుకు పోతున్నాడు. నేటితరం హీరోలకు ఆయన ఓ రోల్ మోడల్. అటు క్లాస్ నుండి ఇటు మాస్ వరకు అతని సినిమాలంటే పడి చస్తారు. తెలుగు రాష్ట్రాల్లో మరెవ్వరికీ లేని స్టార్ డం ఆయనకే సొంతం. ఆయన స్టెప్పులేస్తే అభిమానులు చొక్కాలు చెంపేసికుంటారు. ఆయన సినిమా కోసం మెగా అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తారు అనడంలో అతిశయోక్తి యెంత మాత్రమూ లేదు. తెలుగునాట అంతలా ఆయన్ని ఆరాధిస్తారు.
Radhe shyam: ఇలాంటి టైమ్ లో ‘రాధే శ్యామ్’ కథ లీక్ చేసిన దర్శకుడు..ఫైర్ అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్..?
కొత్త సినిమా వివరాలు:
DVV ఎంటర్టైన్మెంట్స్ తాజాగా తన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా నుండి మెగాస్టార్ చిరంజీవితో చేయబోయే సినిమాను.. అంటే చిరు 156వ చిత్రాన్ని అనౌన్స్ చేసింది. DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అయినటువంటి DVV దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక దీన్ని యంగ్ డైరెక్టర్ అయినటువంటి వెంకీ కుడుముల డైరెక్ట్ చేయబోతున్నారు. ఈయన గతంలో ఛలో, భీష్మ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. దాదాపు ఈ రెండు సినిమాలు సిల్వర్ స్క్రీన్ పైన సందడి చేసాయి. ఛలో పాటలను ఇప్పటికీ మరువలేం.
Netflix: మీరు తరచూ OTT చూస్తుంటారా? నెట్ ఫ్లిక్స్ దిమ్మతిరిగే ఆఫర్లు మీకోసమే!
ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ ఎవరు?
ఇక ఈ విషయం ఇలా బయటకి వచ్చిందో లేదో, వెంకీ కుడుములకి మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్తున్నారు. ఇకపోతే ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు ఇంకా తెలియాల్సి వుంది. త్వరలోనే దీనిపై ఓ ప్రకటన విడుదల చేస్తామని సదరు టీమ్ తెలియ జేసింది. కాగా.. మాధవి రాజు ఈ చిత్రానికి సహ నిర్మాతగా చేయనున్నారని సమాచారం. ఈ సదవకాశాన్ని దక్కించుకున్న డైరెక్టర్ వెంకీ కుడుముల ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.