సినిమా అంటే కామెడీ, పాటలు, యాక్షన్ తప్పనిసరి. సాధారణంగా హీరోలకు విలన్ తో ఫైట్లు ఉంటాయి. హీరో ఆ ఫైట్లు ఎంత బాగా చెయ్యగలిగితే అంత బాగా హీరోయిజం చూపించినట్టు. ఒకవేళ హీరో విల్లన్ తో ఫైట్ చెయ్యడానికి వెనకంజ వేస్తే? నిజానికి ఫైట్ సీన్ ఎంత బాగా వస్తే హీరోయిజం అంత బాగా ఎలివేట్ అవుతుంది. సినిమాలో విలన్ అన్న తరువాత అతను ఎంత పవర్ ఫుల్ అయినా క్లైమాక్స్ లోనే లేదా సినిమా మద్యలోనే అయినా హీరో చేతిలో దెబ్బలు తినాల్సిందే.
చిరంజీవి ‘ఆచార్య’ సినిమాలో సోను సూద్ విలన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తికావొచ్చింది. అయితే ఈ సినిమాలో హీరో చిరంజీవి సోనూ సూద్ ను కొట్టే సన్నివేశం ఒకటి ఉందట. కానీ చిరంజీవి సోనూసూద్ ను కొట్టడానికి కాస్త వెనుకంజ వేశాడట.
కరోనా నేపథ్యంలో దేశంలో విధించిన లాక్ డౌన్ కారణంగా చాలామంది నిరుపేదలకు సోనూసూద్ ఆపద్భాంధవుడు అయ్యాడు. రీల్ హీరోగానే కాకుండా రియల్ హీరోగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు సోను సూద్.
ఆచార్య సినిమా షూటింగ్ లో ముందుగా ప్లాన్ చేసినట్లు ఫైట్ సీన్ ను కాకుండా చిరంజీవి కాలు సోనూసూద్ మీద పెట్టకుండా మొత్తం సీన్ ను రీ షూట్ చేయాల్సి వచ్చిందట. సోనూ సూద్ ఏ స్వయంగా ఈ విషయాన్ని తెలియజేసారు. నాకు పర్వాలేదు అందులో తప్పు ఏం లేదు. మీరు తన్నండి అంటూ చెప్పినా కూడా చిరంజీవి ఒప్పుకోలేదట. “మీ పై కాలు లేపితే నాపై జనాలు నోరు లేపుతారు” అంటూ చిరు స్పందించారట. చిరంజీవి, సోనూసూద్ పై కాలు పెట్టే సీన్ ను సినిమా నుంచి కట్ చేయించి దాని ప్లేస్ లో రీ షూట్ కు ప్లాన్ చేస్తున్నారట.