Pawan Kalyan : దాదాపు పవన్ కళ్యాణ్ మూడు సంవత్సరాలు వెండితెరపై కనపడక పోవటంతో పవన్ నటించిన “వకీల్ సాబ్” కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరికొద్ది గంటల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే సినిమా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. పవన్ కళ్యాణ్ సినిమా కావటంతో మొట్ట మొదటి రోజు చూడటానికి చాలామంది సెలబ్రిటీలు రెడీ అవుతున్నారు. ఇలాంటి తరుణంలో పవన్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి “వకీల్ సాబ్ “ రిలీజ్ గురించి పెట్టిన పోస్ట్ మెగా అభిమానులని మైండ్ బ్లోయింగ్ చేసినట్లయింది.
అభిమానులను ఉద్దేశించి ట్విట్టర్లో చిరంజీవి ఈ విధంగా పోస్టు పెట్టారు..”చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ ని వెండితెరమీద చూడటానికి మీలాగే నేను కూడా ఎదురు చూస్తున్నాను. అమ్మ, కుటుంబ సభ్యులతో రేపు సాయంత్రం థియేటర్లో “వకీల్ సాబ్” చూడబోతున్నాం. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి నా స్పందన మీ అందరితో పంచుకోవడానికి ఎంతో ఆతృతగా ఉన్నాను అంటూ చిరంజీవి ట్విట్టర్లో పోస్టు పెట్టారు. కొద్ది గంటల్లో పవన్ కళ్యాణ్ వెండితెరపై కనిపించబోతున్న నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ కూడా భారీ ఎత్తున “వకీల్ సాబ్” షోస్ కి హడావిడి చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.