మెగాస్టార్ చిరంజీవి ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. ఈ సందర్భంగా తను హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తోన్న 152వ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు. ముందు నుండి ప్రచారంలో ఉన్నట్టుగానే ఈ చిత్రానికి ఆచార్య టైటిల్ ను ఫిక్స్ చేసారు.
ఫస్ట్ లుక్ చిరంజీవి అదిరిపోయాడనే చెప్పాలి. ఫస్ట్ లుక్ పోస్టర్ లోనే హిట్ కళ ఉట్టిపడుతోంది. ఫస్ట్ లుక్ తో పాటు మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేసారు. ధర్మస్థలి అనే ప్రాంతంలో జరిగే కథగా ఆచార్య ఉంటుందని చూపించారు. ఈ పోస్టర్ లో చిరంజీవి ఉగ్ర రూపంలో శత్రుమూకలపై విరుచుకుపడుతున్నట్లు ఉంది. ఇక మోషన్ పోస్టర్ లో సింహం విగ్రహం పక్కనే చిరంజీవి పేరు వేయడం కూడా ఆకట్టుకుంటోంది. వచ్చే వేసవికి ఆచార్యను విడుదల చేయబోతున్నట్లు టీమ్ ప్రకటించింది.