NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Ex Minister Narayana: టెన్త్ పరీక్షా పత్రాల లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణకు బిగ్ రిలీఫ్..

Ex Minister Narayana: పదవ తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో టీడీపీ మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు నారాయణకు బిగ్ రిలీఫ్ లభించింది. ఈ కేసులో ఏపి సీఐడీ అధికారులు నిన్న ఆయనను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయనను చిత్తూరుకు తరలించి మంగళవారం రాత్రి వైద్య పరీక్షల అనంతరం పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హజరుపర్చారు. అయితే వ్యక్తిగత పూచీకత్తుతో మెజిస్ట్రేట్ ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. రూ.లక్ష చొప్పున ఇద్దరు జామీను ఇవ్వాలని మేజిస్ట్రేట్ తెలిపారు. తమ విద్యాసంస్థ విద్యార్ధులకు మార్కులు వచ్చేందుకు పరీక్షకు ముందు నారాయణ సమావేశం ఏర్పాటు చేసి ఆదేశాలు ఇచ్చారని, నారాయణ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ గిరిధర్ రెడ్డి విచారణలో ఈ విషయం వెల్లడించారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

Chittoor court grants bail to Ex Minister Narayana
Chittoor court grants bail to Ex Minister Narayana

Ex Minister Narayana: పోలీసుల అభియోగాన్ని తోసిపుచ్చి బెయిల్ మంజూరు

ఇన్విజిలేటర్ల జాబితా డీఈఓ కార్యాలయంలో ముందుగానే తెలుసుకుని వారికి లంచాలు ఇచ్చి మేనేజ్ చేస్తున్నారని, పేపర్ ను ముందుగానే వాట్సాప్ గ్రూపుల్లో పంపి ఆన్సర్ రాయించి ఇచ్చారని రిమాండ్ రిపోర్టులో తెలియజేశారు. నారాయణ డీన్ గంగాధర్ ఈ కేసులో కీలక పాత్ర పోషించారని పోలీసులు తెలిపారు. నారాయణ పలుకుబడి ఉన్న వ్యక్తికావడంతో ఆయనను రిమాండ్ కు తరలించాలని పోలీసులు మూడు పేజీల రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. 2014లోనే నారాయణ విద్యాసంస్థల చైర్మన్ పదవి నుండి నారాయణ తప్పుకున్నారని పేర్కొంటూ ఆయన తరపు న్యాయవాదులు మేజిస్ట్రేట్ వద్ద పేర్కొంటూ అందుకు తగిన ఆధారాలను సమర్పించారు. దీంతో పోలీసుల అభియోగాన్ని మెజిస్ట్రేట్ తోసిపుచ్చారు. నారాయణ రిమాండ్ ను తిరస్కరించి బెయిల్ మంజూరు చేశారు. బెయిల్ మంజూరు కావడంతో ఈ రోజు నారాయణ విడుదల కానున్నారు.

 

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు చంద్రబాబు లేఖ

మరో పక్క మాజీ మంత్రి నారాయణ అరెస్టు అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రాజకీయ కక్షతో నారాయణ అరెస్టు జరిగిందని పేర్కొన్నారు. హైదరాబాద్ నుండి చిత్తూరు తరలింపులో జాప్యం వెనుక దురుద్దేశ్యం ఉందని చంద్రబాబు మండిపడ్డారు. రఘురామ కృష్ణంరాజు అరెస్టు సమయంలో జరిగిన ఉదంతాన్ని చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. నారాయణను పోలీసు కస్టడీలో ఉంచే ప్రయత్నంపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీ కేసులో అదనపు సెక్షన్లు జోడించి అక్రమ అరెస్టుకు పాల్పడ్డారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

 

 

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju