Christmas: ఆ దేశంలో గుర్రపు పుర్రతో క్రిస్టమస్ వేడుకలు..!

Share

Horse skull: ఒక్క మనం దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా విభిన్న సంప్రదాయాలు, విభిన్న ఆచారాలను పాటిస్తుంటారు. ఒక్కో దేశంలో, ఒక్కో రకంగా పండగలను సెలెబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే యూకేలోని మేరీ ల్యూడ్ లో మాత్రం అన్ని దేశాలకంటే బిన్నంగా క్రిస్టమస్ వేడుకలను జరుపుకుంటారు. యూకేలోని సౌత్ వేల్స్‌ లో క్రిస్మస్‌ సందర్శంగా ప్రతి సంవత్సరం ఈ విచిత్రమైన సంప్రదాయాన్ని పాటిస్తారు. ఆ సాంప్రదాయం గురించి తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఈ ఆచారాన్ని 1800 సంవత్సరంలో మొదటిసారి ప్రారంభించారట. ప్రతి సంవత్సరం క్రిస్మస్ సమయంలో కొంతమంది సభ్యులు ఒక సముదాయంగా ఏర్పడి గుర్రం పుర్రెను పట్టుకుని ప్రతి ఇంటికి తిరుగుతారు.

 

పండుగ సమయంలో ఏం చేస్తారంటే:

ఈ సమయంలో వాళ్లు ధరించే బట్టలు కానివ్వండి, వేసుకునే మేకప్, నగలు అన్నీ కూడా విచిత్రంగా ఉంటాయి. డప్పుచప్పుళ్లు, మేళతాళాలు వాయించుకుంటూ డాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ ఎంతో సందడిగా విధుల్లో తిరుగుతారు. అలా తిరుగుతూ తిరుగుతూ ఒక ఇంటికి వెళ్లి పాటలు పాడుతూ ఆ ఇంటి తలుపు తడతారు. అయితే ఆ ఇంట్లో వాళ్లు తలుపు తీస్తారు కానీ వాళ్లను మాత్రం లోపలికి రమ్మని ఆహ్వానించరు. దీనితో వాళ్ళకి కోపం వచ్చి బిగ్గరగా పాటలు పాడి నానా హంగామా చేస్తారు. వారి హంగామా చూసి ఆ ఇంటివారు వాళ్లను లోపలికి ఆహ్వానిస్తారు. ఇలా చేయడం వారి ఆచారంలో ఒక భాగం. లోపలికి వెళ్లి వారు భోజనం చేసి డ్రింక్ తాగుతారు. ఇలా ప్రతి రోజురోజుకి ఒక ఇంటికి వెళ్తారు.

 

అసలు ఈ గుర్రం ఎందుకు వాడతారు అంటే:

 

మరి వీరితో పాటు ఈ గుర్రం పుర్రెను ఎందుకు వారితో తీసుకెళ్తారు అంటే.. దానిని వారు ఎంతో పవిత్రమైనదిగా భావించి, ఏసుప్రభువు తల్లిగా ఆ గుర్రపు పుర్రెను కొలుస్తారట. ఇలా గుర్రం పుర్రెతో వచ్చిన వారిని ఇంట్లోకి ఆహ్వానిస్తే స్వయానా ఏసు ప్రభువు తల్లిని తమ ఇంటికి ఆహ్వానించినట్లుగా భావిస్తారు. ఇంగ్లండ్, సౌత్ వేల్స్ సరిహద్దులో ఉన్న ఓ బ్రిడ్జి పైన ఏటా క్రిస్మస్ సమయంలో ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. 16, 17 శతాబ్దాల్లో అక్కడ ప్రతి ఒక్కరూ గుర్రాలు పెంచుకునేవారు. ప్రతి వేడుకలో గుర్రాలు కూడా పాల్గొనేలా చేసేవారట. అయితే అప్పటి ప్రజల వేషధారణకు ఇప్పటి వేషధారణకు సంబంధం లేదు. ఎందుకంటే ఇప్పటి జనరేషన్ వారిని కూడా ఆకట్టుకునేలా ఈ వేడుక ఉండాలని కొద్దిగా మేకప్, వస్త్రధారణ విషయంలో కొద్దిగా ఆధునికతను జతచేర్చారు.


Share

Related posts

పబ్జీ స్థానంలో కొత్త గేమ్స్ వచ్చేసాయి..! చూశారా..!

bharani jella

పాట్నాలో వాజ్‌పేయి విగ్రహం : నితీష్ కుమార్

Siva Prasad

అశ్వత్థామరెడ్డికి యాజమాన్యం షాక్:లీవ్ రిజక్ట్

somaraju sharma