NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Hema : తిరుపతి సభలో సినీనటి హేమ షాకింగ్ కామెడీ..! రగిలిపోతున్న బీజేపీ పెద్దలు..!!

Hema గత ఎన్నికల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సినీ హాస్యనటి హేమ.. ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసింది. తాజాగా కాషాయ కండువా కప్పుకున్నారు. తిరుపతి ఉప ఎన్నికలో భాగంగా నెల్లూరులో జరిగిన ఎన్నికల ప్రచారసభ వేదికగా బీజేపీలో చేరారు.

ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రత్నపభ తరఫున ఎన్నికల ప్రచారానికి హేమ సిద్ధమయ్యారు.అనంతరం హేమ మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీలో చేరడం చాలా ఆనందంగా ఉందన్నారు. అంతేకాదు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడిన మాటలు నవ్వులు పూయించాయి. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు కూడా సరిగ్గా పలకక పోవడం, తర్వాత దాన్ని కవర్ చేసుకుంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అందర్నీ నవ్వులు తెప్పించాయి.

Hema పవర్ స్టార్ స్మరణ :ప్రధాని విస్మరణ!

అంతేగాక సభలో ఆమె ‘వకీల్ సాబ్’ సినిమా గురించి ప్రస్తావించి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఆకాశానికెత్తేశారు. ప్రధాని మోదీ గురించి మర్చిపోయారు. దీంతో వెంటనే పక్కనే ఉన్న బీజేపీ నేత… మోదీ గురించి మాట్లాడాలని చెవిలో చెప్పారు. అప్పుడు ఆమె ప్రధాని మోదీ కార్యక్రమాల గురించి ఏకరువు పెట్టారు. ఇలా ఆమె కన్ఫ్యూజన్‌తో సభ నవ్వులతో హోరెత్తింది.తర్వాత, ప్రసంగం కొనసాగిస్తూ.. కాసేపు ప్రధాని నరేంద్ర మోదీపై పొగడ్తల వర్షం కురిపించారు.

అభ్యర్థి పేరు పైనే అయోమయం!

చివరిగా ఇక్కడికి రావడానికి ప్రధాన కారణమైన ఉప ఎన్నిక గురించి హేమ ప్రస్తావించారు. ఈ సందర్భంగా తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి పేరు కూడా పలకడానికి హేమ ఇబ్బందిపడ్డారు. దీంతో ఆమె పక్కన ఉన్న వారు అభ్యర్థి పేరు ‘రత్నప్రభ’ అని చెప్పడంతో ఉన్నట్లుండి హేమ సీరియస్ అయ్యారు. పార్టీలో చేరి రెండు నిమిషాలు కాకముందే.. బీజేపీ నేతలకు ఓ రేంజ్‌లో షాకిచ్చారు. నాకు అన్నీ తెలుసు.. మీరేమీ చెప్పొద్దంటూ క్లాస్ పీకారు.‘‘బీజేపీ అభ్యర్థి రత్నప్రభ గారు.. నాకు తెలుసు సార్. నేను అన్నీ నేర్చుకునే వచ్చాను. ప్లీజ్.. మీరు నేర్పిస్తే, నేను నేర్చుకుని ఇక్కడ ప్రజల్లోకి చెప్పడానికి వచ్చానని మీడియా వాళ్లు రాసేస్తారు. ప్లీజ్, నాకు మాట్లాడే ఛాన్స్ ఇచ్చారు కదా! నేనే చెబుతా! కాబట్టి, రత్నప్రభ గారిని మంచి ఓటు బ్యాంకుతో గెలిపించి కచ్చితంగా అసెంబ్లీకి మనందరి తరఫున పంపాలని కోరుకుంటున్నాను.’’ అంటూ బీజేపీ లీడర్ హేమ ఫుల్ కామెడీ చేశారు.

ఏ ఎన్నికో కూడా తెలియదా?

ఇదిలా ఉంటే, తిరుపతిలో జరుగుతోంది అసెంబ్లీ ఎన్నికా.. లోక్‌సభ ఎన్నికా అన్నదానిపై కూడా ఆమెకు క్లారిటీ లేకుండా పోయింది.
నాకు అన్నీ తెలుసు, మీరేమీ చెప్పొద్దు అంటూ బీజేపీ నాయకులపై అంతెత్తున లేచిన హేమ.. ఆ వెంటనే భయంకరమైన తప్పు చెప్పేసి అడ్డంగా బుక్కయ్యారు. జరిగేది లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికైతే.. రత్నప్రభను గెలిపించి అసెంబ్లీకి పంపాలని కోరి నవ్వులపాలయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రత్నప్రభను అసెంబ్లీకి పంపాలంటూ హేమ చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా సమాధానం చెప్పుకోలేకపోతున్నాయి. ప్రత్యర్థి పార్టీలు మాత్రం హేమ స్పీచ్‌ను ఓ ఆట ఆడేసుకుంటున్నారు.

author avatar
Yandamuri

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju