Cinema Bandi: సినిమా బండి ట్రైలర్ కి అదిరే రెస్పాన్స్..! ప్రముఖుల ప్రశంసలు

cinema bandi trailer hilarious
Share

Cinema Bandi:  సినిమా బండి Cinema Bandi క్రియేటివిటీకి పెద్ద పీట వేస్తున్న రోజులివి. మంచి కథలుంటే సినిమా అవకాశం కోసం వెయిట్ చేయడం కాదు.. తమ కథలను డాక్యుమెంటరీలుగా, వెబ్ సిరీస్ లుగా తెరకెక్కంచి తమ ప్రతిభ చూపించే రోజులు. ఇలా ఎంతోమంది ఔత్సాహికులు తమ ప్రతిభను చాటుకున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో సెటిల్ అయిన ప్రముఖులు కూడా ఆసక్తికరమైన కంటెంట్లను ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కోసం తెరకెక్కిస్తున్నారు. ఇందులో సక్సెస్ అవుతున్నారు. ఓటీటీకి వీక్షకులు కూడా ఎక్కువ కావడంతో అనేక సిరీస్ లు వస్తున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్ లో పలు సినిమాలు తెరకెక్కించిన రాజ్ అండ్ డీకే ఒక సినిమాను నిర్మించి నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేస్తున్నారు. ఆ సినిమానే ‘సినిమా బండి’.

cinema bandi trailer hilarious
cinema bandi trailer hilarious

ప్రవీణ్ కండ్రేగుల అనే డెబ్యూ డైరక్టర్ తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ ను ఇటివలే రిలీజ్ చేశారు. కేవలం రెండు రోజుల్లోనే 1 మిలియన్ వ్యూస్ దక్కించుకుని సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అంతా కొత్తవారితో తెరకెక్కించిన ఈ సినిమాకు నెటిజన్లే కాదు.. ఇండస్ట్రీ సెలబ్రిటీలు, మీడియా నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. పల్లెటూరి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఆంధ్రా-కర్ణాటక బోర్డర్ లోని ఓ పల్లెటూరు, అక్కడి వ్యవహారిక భాషతో ఈ సినిమా ఉంది. ఆటో డ్రైవర్, బార్బర్, ఫొటోగ్రాఫర్, కూరగాయలు అమ్మే వ్యక్తి, కెమెరా ఓనర్.. ఇలా గ్రామంలోని పాత్రలతోనే కామెడీ కంటెంట్ తో తెరకెక్కించారు. నటీనటుల హావభావాలు పూర్తి కామెడీ కంటెంట్ తో ట్రైలర్ నవ్వులు పూయిస్తోంది.

ట్రైలర్ చూస్తేనే సినిమా అంతా కామెడీతో తెరకెక్కించారని అర్ధమవుతోంది. తన ఆటోలో వదిలేసిన కెమెరా ఆట్ డ్రైవర్ కు దొరుకుతుంది. అదే.. కెమేరాతో సినిమా తీయాలి.. గ్రామంలోని వారితోనే తెరకెక్కించాలి అనే తపనతోనే ఈ సినిమా కంటెంట్ ఉంది. ‘అందరిలో సినిమా తీయాలనే తపన ఉంటుంది’ అనే కాన్పెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే బజ్ క్రియేట్ చేసుకుంది. సమంత, మనోజ్ బాజ్ పేయి, షాహిద్ కపూర్, ప్రియమణి, తరుణ్ భాస్కర్, రాశి ఖన్నా, నాగ్ అశ్విన్.. వంటి సెలబ్రిటీలు ప్రశంసలు దక్కించుకున్న ఈ సినిమా మే 14న నెట్ ఫ్లిక్స్ లో ప్రీమియర్ కానుంది.


Share

Related posts

Eating disorder: తినకూడని వాటిని తినాలనిపించే విధంగా చేసే వ్యాధుల పేరులు తెలుసుకోండి!! 

Kumar

రూ. 100 పెట్టి ఉల్లి కొంటున్నాం..! ఓ సారి చరిత్ర తెలుసుకోపోతే ఎలా..!?

bharani jella

రామ మందిర నిర్మాణ భూమి పూజ‌.. ఏ సీఎంకూ ఆహ్వానం లేదు..!

Srikanth A