Cinema celebrities : కమర్షియల్ యాడ్స్ తో సినిమాల కంటే నాలుగింతలు సంపాదిస్తున్న సెలబ్రిటీలు

Share

Cinema celebrities : సౌత్ లేదా నార్త్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు లేదా హీరోయిన్లు సినిమాలలో నటించడం మొదలు పెట్టిన ఒకటి రెండు సంవత్సారలలోనే ఆదాయం రెట్టింపు అవుతోంది. మొదటి సినిమా గనక సూపర్ డూపర్ సక్సెస్ అయితే అందరి దృష్టి ఆ జంట మీదే ఉంటుంది. మరో సినిమా చేతికి వచ్చే లోపే షాపింగ్ మాల్స్ కి ప్రచార కర్తగానో లేద ఓపెనింగ్స్ కో..లేదంటే బ్రాండ్ పార్టనర్స్ గానో కమిటవుతుంటారు. ఇలా వచ్చే ఆదాయం సినిమాల కంటే ఎక్కువే ఉంటుందని సమాచారం. సినిమాకి డేట్స్ ఇచ్చి ఆ సినిమా పూర్తి అయ్యే వరకు అందుకునే పారితోషికంటే ఒకే ఒక్కరోజులో పూర్తయ్యే నేషనల్, ఇంటర్ నేషనల్ యాడ్స్ లో నటిస్తే వచ్చేదే నాలుగింతలు ఉంటుంది.

cinema-celebrities-are earning more amount than films by ads
cinema-celebrities-are earning more amount than films by ads

విజయ్ దేవరకొండ లాంటి యంగ్ హీరో నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, నాగ చైతన్య అక్కినేని, సమంత, కాజల్ అగర్వాల్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే, రష్మిక మందన్న, బాలీవుడ్ లో అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, అజయ్ దేవగన్, ఆలియా భట్, కాజోల్, కరీనా కపూర్, కియారా అద్వాని ..ఇలా దాదాపు పాపులర్ హీరో, హీరోయిన్స్ అందరూ కమర్షియల్ యాడ్స్ లో నటిస్తున్నారు. ఒక్కో ఇంటర్ నేషనల్ యాడ్ కి 5 నుంచి 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఉంటుంది.

Cinema celebrities : సినిమా సెలబ్రిటీస్ కి నాలుగు చేతులా సంపాదించే అవకాశం..!

ఇది ఒక అగ్రిమెంట్ ప్రకారమే నేషనల్ ..ఇంటర్ నేషనల్ ఛానల్స్ లో ప్రసారం చేస్తారు. కొన్ని యాడ్ ఫిలింస్ త్రివిక్రం, కొరటాల శివ లాంటి స్టార్ డైరెక్టర్ కూడా డైరెక్ట్ చేస్తున్నారు. ఇక టాక్ షోస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తే ఆ రెమ్యునరేషన్ కూడా భారీగా ఉంటోంది. అందుకే మన స్టార్స్ ఏమాత్రం కమర్షియల్ యాడ్ ఫిలింస్ చేసే అవకాశం వచ్చినా కమిటవుతున్నారు. బ్రాండ్ పార్టనర్ గా ఓకే చెబుతున్నారు. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ థమ్సప్ప్ యాడ్ లో కనిపించిన సంగతి తెలిసిందే. ఏదేమైనా సినిమా సెలబ్రిటీస్ కి నాలుగు చేతులా సంపాదించే అవకాశం ఎక్కువగా యాడ్స్ పరంగా రావడం ఆసక్తికరం.


Share

Related posts

చంద్రబాబుకు అసహనం

sarath

అక్టోబర్‌లో సెట్స్‌పైకి రాజశేఖర్‌ సినిమా

Siva Prasad

 Nimmagadda : ఎస్ఈసీ నిమ్మగడ్డపై చర్యలకు చెకచెకా అడుగులు

somaraju sharma