NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్ బిగ్ స్టోరీ

Mumbai: ‘మాస్క్ పెట్టుకోని ఆ నగర ప్రజలు.. 58కోట్లు ఫైన్ కట్టేసారు..!

civilians paid 58 crores as fine

Mumbai: ముంబై Mumbai ఫస్ట్ వేవ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొన్న భారత్ సెకండ్.. వేవ్ లో చిగురుటాకులా వణికిపోయింది. మహారాష్ట్రలో రోజుకి వేలల్లో కేసులు నమోదైన సమయంలో దేశంలో మరెక్కడా వైరస్ విజృంభణ లేదు. దీంతో కేంద్రం కూడా పెద్దగా అలెర్ట్ కాలేదు. కానీ.. పరిస్థితి చాపకింద నీరులా మారి దేశం మొత్తాన్ని కుదిపేసింది. వెంటనే కఠిన చర్యలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అధికారాలు ఇచ్చింది. ఈక్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న కఠిన నిర్ణయాల్లో ఒకటి బహిరంగ ప్రదేశఆల్లో మాస్క్ ధరించకపోతే ఫైన్ విధించడం ఒకటి. ఇలా దేశంలోని ఓ నగర ప్రజలు ఏకంగా 58కోట్లు ఫైన్ల రూపంలో కట్టారంటే నమ్మగలామా..? కానీ.. ఇది నిజం.

civilians paid 58 crores as fine
civilians paid 58 crores as fine

మహారాష్ట్రలో కేసుల తీవ్రత పెరిగిపోయి.. అమరావతి, పూణె, నాగ్ పూర్ వంటి ప్రాంతాల్లో పాక్షిక లాక్ డౌన్లు విధించింది ప్రభుత్వం. అప్పటికి ముంబైలో లాక్ డౌన్ లేకున్నా కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో ముంబై నగరంలో కఠిన ఆంక్షలు అమలు చేసింది. ఇందులో అందరూ మాస్క్ పెట్టుకోవాలనే నిబంధన ఒకటి. దీనిని కఠినంగా అమలు చేయమని.. ఉల్లంఘించిన వారి నుంచి జరిమానా విధించాలని ఆదేశించింది. దీంతో పోలీసులు ఆంక్షలను కఠినంగానే అమలు చేశారు. ఎంతగా అంటే.. ఒక్క ముంబై నగరంలోనే.. మాస్కులు పెట్టుకోని ప్రజల నుంచి ఏకంగా.. 58కోట్లు ఫైన్ల రూపంలో వసూలు చేశారు. ఈ విషయాన్ని బృహాన్ ముంబై కార్పొరేషన్ అధికారులు అధికారికంగా వెల్లడించారు.

Read More: Fevicol: ‘ఫెవికాల్’ క్రియేటివిటీ..! కోకాకోలా దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకుంది..!

ఈస్థాయిలో నగదు వసూలు కావడం సంచలనం రేపుతోంది. ఇలా మాస్కులు ధరించని ప్రజల నుంచి ఫైన్లు వసూలు చేయడంలో ముంబై పోలీసులు, రైల్వే పోలీసులు కీలకంగా వ్యవహరించారు. ఈ 58 కోట్లు కూడా జూన్ 23 వరకూ వసూలైన మొత్తంగా అధికారులు వెల్లడించారు. వ్యక్తిగత రక్షణ, వ్యవస్థలను కాపాడటం అనే అంశంలో ప్రజల నిర్లక్ష్యానికి ఈ భారీ జరిమానా నిదర్శనంగా నిలుస్తోంది. ప్రస్తుతం దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య గణణీయంగా తగ్గింది. గడచిన 24 గంటల్లో దేశంలో 51,667 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,329 మంది ప్రాణాలు కోల్పోయారు. 64,527 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఈమేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ వివరాలు వెల్లడించింది.

 

 

author avatar
Muraliak

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?