Icon : కొన్ని సినిమాలు అట్టహాసంగా ప్రారంభమవుతాయి. క్రేజీ డైరెక్టర్ – క్రేజీ హీరో – క్రేజీ ప్రొడక్షన్స్ హౌజ్..ఇలా భారీ కాస్టింగ్ అండ్ క్రూతో సినిమా ప్లాన్ చేసి సర్ప్రైజింగ్ గా అప్డేట్ ఇస్తారు. కానీ రకరకాల కారణాల వల్ల ప్రాజెక్ట్ పెండింగ్ లో పడుతుంది. ఎప్పుడు మొదలవుతుందో మేకర్స్ నుంచి క్లారిటీ రాకపోవడంతో అభిమానులు, ప్రేక్షకులు ఇక ఈ సినిమా ఆగిపోయినట్టే అని చెప్పుకుంటారు. ఈ మాటలు అటు ఇటు పడి వైరల్ గా మారతాయి. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కమిటయిన ఓ క్రేజీ ప్రాజెక్ట్ విషయంలో కూడా గత ఏడాది నుంచి వ్యవహారం ఇలా నానుతూనే ఉంది.
దిల్ రాజు నిర్మాతగా, వేణు శ్రీరామ్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఐకాన్ టైటిల్..కనబడుటలేదు అనే క్యాప్షన్ తో ఒక సినిమాను ఫస్ట్ లుక్ తో పాటు ప్రకటించారు. ఈ సినిమా ప్రకటించాక అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా చేశాడు. సుకుమార్ తో పాన్ ఇండియన్ సినిమాగా పుష్ప చేస్తున్నాడు. మిగతా డైరెక్టర్స్ కూడా అల్లు అర్జున్ తో సినిమా చేయాలని లైన్ లో వేచి చూస్తున్నారు. కానీ ఐకాన్ మాత్రం ప్రస్తావనకి రాలేదు. ఇక వేణు శ్రీరామ్ కూడా వేరే దర్శకుడితో సినిమా చేసేందుకు ప్లాన్ లో ఉన్నాడని ఈ మధ్య బాగానే ప్రచారం సాగుతుంది.
Icon : ‘ఐకాన్’ ఉందని క్లారిటీతో షాకిచ్చాడు.
అయితే నిర్మాత బన్నీ వాస్ ..’ఐకాన్’ ఉందని క్లారిటీతో షాకిచ్చాడు. ఇప్పుడు పుష్ప మొదటి భాగం జరుగుతుండగా రెండవ భాగం వచ్చే లోపు అల్లు అర్జున్ – వేణు శ్రీరామ్ ల ఐకాన్ పట్టాలెక్కుతుందని ఇది పూర్తయ్యాకే పుష్ప రెండవ భాగం ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత కొరటాల శివ – అల్లు అర్జున్ కలయికలో పాన్ ఇండియన్ సినిమా ఉండనుందని వెల్లడించారు. కాకపోతే ఈ ప్రాజెక్ట్ కొన్నాళ్ళు పక్కకు పెట్టనున్నారట. కొరటాల శివ ప్రస్తుతం ఆచార్య, చేస్తున్నాడు. ఆ తర్వాత జూనియర్ ఎన్.టి.ఆర్ తో ఒక పాన్ ఇండియన్ సినిమా చేయాల్సి ఉంది. మొత్తానికి ఆగిపోయిందనుకున్న అల్లు అర్జున్ – వేణు శ్రీరామ్ ల ‘ఐకాన్’ మొదలవబోతోంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!