Niharika: తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మొత్తం మీద మెగా ఫామిలీ నుంచి వచ్చిన హీరోస్ ఏ ఎక్కువ. అలాగే వారి సక్సెస్ రేట్ కూడా అందుకు తగ్గట్టే ఉండడం విశేషం. ఏకంగా మెగా హీరోలు ఓ క్రికెట్ టీమ్‌లా ఉన్నారు. ఈ జాబితాలో తాజాగా మెగాస్టార్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కూడా యాడ్ అయ్యాడు. అయితే మెగా ప్రిన్సెస్ నిహారిక Niharika కొణిదెల వివాహం అయినప్పటి నుంచి అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న ఒకటి ఉంది.
అదేమిటంటే నిహారిక భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్య సినిమాలలోకి వస్తాడా అని. ఈ విషయమై ఎన్నో చోట్ల ఎన్నో కధనాలు ప్రచురింపబడ్డయి. కొన్ని వార్తలలో అయితే ఏకంగా చైతన్య సినిమా పట్టాలెక్కేసింది అంటూ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పటి వరకు ఈ విషయం గురించి ఎక్కడా అధికారిక ప్రకటన లేదు. అసలు చైతన్య కి సినిమాలలోకి రావాలని ఉందా లేదని అనే దానిపై కూడా క్లారిటీ లేదు. తాజాగా మెగా ప్రిన్సెస్ ఈ విషయం పై స్పందించి క్లారిటీ ఇచ్చేసింది.
ఓ ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పారు. అందులో చైతన్య సినిమాలలోకి ఎప్పుడు వస్తారు అన్న ప్రశ్నకు గాను ఆమె కచ్చితమయిన సమాధానం ఇచ్చింది. ‘‘నాకు తెలిసినంత వరకు చైతన్యకు సినిమాలు చూడడం అంటే చాలా ఇష్టం కానీ ఆలా అని సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడని కాదు. సినిమాలను చూడడం వరకే తనకు ఇష్టం. నా భర్తకు సినిమాలలోకి వచ్చే ఆసక్తి లేదు’’ అని చెప్పింది.