NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

తిరుపతి లో పవన్ తుస్ స్… సోము కాముగా చెప్పేసాడు

 

అనుకున్నదే అయింది… జనసేనుడు మరోసారి వెనకడుగు వేశాడు.. తిరుపతి ఉప ఎన్నికల్లో ఇప్పటివరకు ఖరారు కాని బిజెపి జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పై దాదాపు ఇరు పార్టీలకు ఓ క్లారిటీ వచ్చినట్లు కనిపిస్తోంది. దీన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పకనే చెప్పేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో భాజపా తరఫున నిలబడే అభ్యర్థికి జనసేన కార్యకర్తలు అండగా నిలవాలని అంటూ తిరుపతి భాజపా పదాధికారుల సమావేశం సాక్షిగా సోము ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా భాజపా జనసేన నాయకుల్లో చర్చనీయాంశం అయింది.

ఎన్ని అడుగులు వెనక్కు వేస్తారు??

జనసేన పార్టీ బీజేపీ కు మిత్రపక్షంగా జతకట్టిన తర్వాత నుంచి పలు ఎన్నికల్లో భాజపా తన ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భాజపా ఒంటరిపోరుకు జనసేన సహకరించింది. అలాగే పో తిరుపతి ఉప ఎన్నికల్లో సైతం భారతీయ జనతా పార్టీ తరఫున రంగంలోకి దిగి బోయే అభ్యర్థికి జనసేన మద్దతు ఇవ్వబోతుందని, ఇటీవల తిరుపతి పర్యటనకు వచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యకర్తలతో నాయకులతో సమావేశం సందర్భంగా తిరుపతి లోక్సభ నియోజకవర్గం పరిధిలో పార్టీ బలాన్ని పరిశీలించి అవాక్కయ్యారని, కనీసం కొన్ని నియోజకవర్గాల్లో నాయకులే కరువయ్యారని దీంతో జనసేన పార్టీ తరఫున ఉప ఎన్నికల్లో ఉంచడం వల్ల ఒరిగేదేమీ లేదని తేలడంతో పవన్ మౌనం దాల్చి ఆ కార్యకర్తల సమావేశాన్ని ముగించారు అని “న్యూస్ ఆర్బిట్ ” ముందే చెప్పింది. అన్యమనస్కంగానే ఆ కార్యకర్తల సమావేశాన్ని ముగించిన పవన్ తిరుపతి ఉప ఎన్నికలలో భాజపా అభ్యర్థి నిలబడితే గట్టిపోటీ ఇవ్వగలమని భావించే, బిజెపి అధినాయకత్వానికి సైతం దీనిపై ఒప్పుకున్నట్లు సమాచారం. హైదరాబాద్ లో రెండు రోజుల క్రితం భాజపా జనసేన అగ్రనాయకులు ఈ సమావేశంలో సైతం తిరుపతి ఉప ఎన్నికల్లో భాజపా అభ్యర్థి అయితేనే మంచి పోటు ఇవ్వగలమని నాయకులు నిర్ణయించారు. ఈ సమావేశం తర్వాత సోము వీర్రాజు నేరుగా తిరుపతి పార్టీ పదాధికారుల సమావేశానికి హాజరయ్యారు. పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధర్ సమక్షంలోనే సోము వీర్రాజు తిరుపతి ఉప ఎన్నికల్లో తమ పార్టీ తరపు నుంచి అభ్యర్థిని నిలబెడతామని ప్రకటించారు. దీనికి పదాధికారులు కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున మంచి స్పందన లభించింది. దీంతో బీజేపీ జనసేన పొత్తు లో మరోసారి బిజెపి ముందడుగు వేయగా జనసేన వెనకడుగు కనిపించింది.

దీన్ని ఎలా సమర్దిస్తారు??

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ నుంచి తప్పుకున్న అంశాన్ని, బీజేపీకి బేషరతుగా జనసేన మద్దతు ప్రకటించడం వంటి అంశాలను తెలంగాణ సెంటిమెంట్ కోణంలో జనసేన పార్టీ నాయకులు ఇప్పటివరకు సమర్థించుకున్నారు. అందులోనూ గ్రేటర్ ఎన్నికల్లో బిజెపికి మంచి స్థానాలు లభించడంతో పవన్ ఒక అడుగు వెనక్కి వేయడం వల్లే ఇదంతా సాధ్యం అయిందని జనసేన పార్టీ నాయకులు సర్ది పుచ్చుకున్నారు. అయితే తిరుపతి ఉప ఎన్నికల్లో సైతం మళ్లీ జనసేన పార్టీ వెనకడుగు వేస్తే ఈసారి కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత తప్పదు. ప్రతిసారి బిజెపి కు తోకగా మారుతుందనే తప్పా పార్టీ ఉనికి గురించి కనీసం పట్టించుకునే పరిస్థితి లేదని ఇప్పటికే కార్యకర్తలు ఆగ్రహం ఉంది. సోము వీర్రాజు మాటలు నిజమై భాజపా నుంచే తిరుపతి లోక్ సభ అభ్యర్థి ప్రకటన ఉంటే కనుక దానికి పవన్ సై అంటే కనుక జనసేన పార్టీ నాయకులు నుంచి పెద్ద ఎత్తున నిరసన తప్పదు. అయితే తిరుపతి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని కొన్ని నియోజకవర్గాల్లో కనీసం జనసేన పార్టీ నాయకులు లేరు. అక్కడ ఎలాంటి కమిటీలు లేకుండా పోటీ చేయడం సబబు కాదని పవన్ సమర్థించుకున్న ఇప్పటివరకు కమిటీలు వేయకపోవడం ఏమిటని నాయకుల నుంచి ఎదురు ప్రశ్నలు తప్పవు. ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఎందుకనే అసహనం పార్టీ నాయకుల్లో వస్తే పార్టీ ఉనికికే ప్రమాదం. దీన్ని పవన్ తెలుసుకొని బిజెపి నాయకులతో మాట్లాడి, ముందుకు వెళితేనే పార్టీ కు మంచి జరుగుతుంది.

author avatar
Special Bureau

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju